ఎటువంటి సినిమా ప్రయత్నాలు చేయకుండానే డైరెక్టర్ తేజ రూపంలో జయం సినిమా అవకాశాన్ని దక్కించుకొని హీరోగా వెండితెర పైకి అడుగు పెట్టాడు నితిన్. హీరోగా ఈజీగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. జయం చిత్రం మొదలుకొని ఇటీవల విడుదలైన మాచర్ల నియోజకవర్గం చిత్రం వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని హీరోగా తనకంటూ ఒక సెపరేట్ ట్రెండ్ ని సెట్ చేసుకున్నాడు. చిత్రం మూవీస్ బ్యానర్ పై అప్పట్లో ఫుల్ ఫామ్‌లో ఉన్న తేజ దర్శకత్వంలో జయం సినిమా తెరకెక్కింది. చిత్రం, నువ్వు నేను వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు తేజ.
2002 జూన్ 14న విడుదలైన జయం సినిమా రూ.2కోట్లు బడ్జెట్ తో నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకొని రూ.10 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఈ చిత్రంలో రాళ్లపల్లి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, షకీలా, ఢిల్లీ రాజేశ్వరి, సుప్రీత్ రెడ్డి, సుమన్ శెట్టి, బేబీ శ్వేత ప్రధాన తారాగణంగా నటించారు. సినిమాకు గాను బెస్ట్ విలన్‌గా గోపిచంద్, బెస్ట్ మేల్ కమెడీయన్‌గా సుమన్ శెట్టి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా శ్వేత, వెళ్లవయ్యా వెళ్లు అంటూ హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పిన సింగర్ సునిత ఇలా మొత్తం నాలుగు అవార్డులను కైవసం చేసుకుంది.
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో సదా పదే పదే టేకులు తీసుకోవడంతో తేజకు కోపం వచ్చి ఆమెను కొట్టినట్టు అప్పటిలో వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అప్పట్లో ఈ విషయం చాలా పెద్ద దుమారం రేపింది . తేజ తన సినిమాలో పనిచేసే హీరోయిన్స్ పై ఎక్కువగా చేయి చేసుకుంటాడన్న ప్రచారం జరిగింది. ఈ వార్తపై డైరెక్టర్ తేజ కూడా స్పందించి తాను కావాలని కొట్టను అని.. నటనలో భాగంగా ఒక్కోసారి అలా జరుగుతుందని తేజ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
జయం సినిమాలో తేజ చేయి చేసుకోవడంతో హీరోయిన్ సదా భోరున విలపిస్తే అప్పుడు హీరో నితిన్ ఆమెను ఓదార్చడంతో పాటు తేజపై ఫైర్ అయ్యి షూటింగ్‌కు కూడా రానని తేల్చిచెప్పాడన్న టాక్ కూడా అప్పటిలో బయటకొచ్చింది. షూటింగ్ పూర్తయిన తరువాత కూడా పాటలు ఎక్కువగా ఉన్నాయని.. రన్ టైమ్ ఎక్కువగా ఉందనే విషయంలో దర్శకుడు తేజకు, హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి కూడా వాదోపవాదాలే జరిగాయాట. నితిన్ తొలి సినిమా విడుదలకు ముందే వివాదాలతో థియేటర్లలోకి వచ్చింది. అలా వచ్చిన జయం బ్లాక్‌బాస్టర్ టాక్‌తో నితిన్ కెరీర్‌లో ఓ మైలు రాయిగా నిలిచిపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…