టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా వరుస విజయాలకి సౌతాఫ్రికా బ్రేక్ వేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సఫారీ టీమ్.. 5 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ అజేయ హాఫ్ సెంచరీతో సఫారీలను గెలిపించాడు.ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలని పాక్ అభిమానులు ఎన్నో ప్రార్ధనలు చేశారు. కాని వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ఈ విజయం సౌతాఫ్రికా సెమీస్ అవకాశాలను మెరుగుపరచగా.. పాకిస్థాన్‌ను టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసిందనే చెప్పాలి.
దక్షిణాఫ్రికాపై భారత జట్టు ఓటమి తర్వాత గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టు మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు, ఒక మ్యాచ్ వాష్ అవుట్ కావడంతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్‌కు చేరుకుంది. ఇక భారత్ గురించి చెప్పాలంటే రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాకు ఐదు పాయింట్లు, భారత్‌కు నాలుగు పాయింట్లు ఉన్నాయి. గ్రూప్-2లో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. జింబాబ్వే జట్టు నాలుగో స్థానంలో ఉంది. పాక్ జట్టు రెండు పాయింట్లతో ఐదో స్థానంలో, నెదర్లాండ్స్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి.
భారత్ ఓటమి తర్వాత ప్రస్తుతం పాక్ జట్టుకు ఇబ్బందులు తలెత్తాయి. దక్షిణాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించినట్లయితే, బాబర్ సేన ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. దక్షిణాఫ్రికాను పాకిస్థాన్ ఓడించినా.. నెదర్లాండ్స్‌తోనూ దక్షిణాఫ్రికా ఆడాల్సి ఉన్నందున అది కష్టమేమీ కాదు కాబట్టి చివరి మ్యాచ్‌లో ఆఫ్రికా జట్టు గెలిస్తే 7 పాయింట్లు దక్కుతాయి. మరోవైపు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లను ఓడించడం ద్వారా పాకిస్థాన్ ఆరు పాయింట్లను మాత్రమే చేరుకుంటుంది. దీంతో పాక్ దాదాపు నిష్క్రమించినట్టే అని చెప్పాలి. టాప్ 2లో సౌతాఫ్రికా, ఇండియా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇండియా తన తదుపరి మ్యాచ్ లలో బంగ్లాదేశ్, జింబాబ్వేతో పోరాడనుంది. ఇవి రెండు గెలిస్తే టాప్‌కి వెళుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…