Pani Puri : సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది ఏం స్నాక్స్ తిందామా.. అని ఆలోచిస్తుంటారు. కొందరు అయితే రోజు మొత్తం ఏదో ఒక చిరుతిండి తినేందుకే వెదుకుతుంటారు. ఇంట్లో ఏమీ లేకపోతే బయటకు వెళ్లి మరీ తింటారు. ఇక మన దేశంలో అత్యధిక శాతం మంది తింటున్న చిరుతిళ్లలో పానీపూరీ కూడా ఒకటి. మనకు ఎక్కడ పడితే అక్కడే ఇవి కనిపిస్తాయి. అయితే పానీ పూరీలను తినేవారు తప్పనిసరిగా ఈ నిజాలను తెలుసుకోవాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పానీ పూరీ పేరు వినగానే మనకి నోరూరుతుంది. రోడ్డు ప్రక్కన కనపడే చాట్ బండారాలు, పానీపూరీ, చాట్స్ తినటానికి మనం వెనుకాడం. పానీ పూరీలని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. నోరూరించే ఆ తినుబండారాలు తినే వారికి ఇది ఒక చేదు వార్త అనుకోవచ్చు. పానీపూరీలో ఎన్నో రకాల బాక్టీరియా, ఫంగస్ ఉన్నాయని వైద్యులు చేసిన పరీక్షల్లో తేలింది. చూడటానికి స్ట్రీట్ ఫుడ్ బాగానే ఉన్నా వాటిలో వాడుతున్న నీటిలో 45 శాతం, చట్నీలో 75 శాతం కాలుష్యకారకమైన ఈ-కోలి బాక్టీరియా ఉంటుందని, ఇది ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని అంతే కాకుండా ఆరోగ్యాన్ని నెమ్మదిగా క్షీణింపజేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చాలా చోట్ల విక్రేతలు పానీపూరి, చాట్స్ మనకి ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టి ఇస్తారు. అయితే ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో తినటం ప్రాణానికి కూడా హానికరమని చెబుతున్నారు. ఆ తినుబండారాలు తిన్నాక వాటిని పక్కనే పడవేస్తాము. శుభ్రత లేమి కారణంగా వాటిలో ఎక్కువగా ఫంగస్, బాక్టీరియా చేరుతుందని చెబుతున్నారు. శుభ్రత అనేది ఆ తినుబండారాలలో చాలా ముఖ్యమని కానీ చాలా బండ్ల దగ్గర శుభ్రత అనేది లోపిస్తుందని సాధ్యమైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పానీ పూరీ అంటే ఇష్టం ఉన్నవారు ఇంటిలో తయారుచేసుకొని తింటే మంచిది. ఏదైనా సరే మనం ఇంటిలో తయారుచేసుకుని తింటేనే మంచిది. లేదంటే అనారోగ్యాలకు స్వాగతం పలికిన వారమవుతాము. కనుక ఇకపై పానీపూరీలను తినేవారు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేదంటే అనవసరంగా రోగాల బారిన పడతారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…