How To Book Tatkal Tickets : ఈ ట్రిక్స్ పాటిస్తే చాలు.. త‌త్కాల్ టికెట్‌లో బెర్త్ క‌న్‌ఫామ్ అవుతుంది..!

How To Book Tatkal Tickets : రైల్వేలో నిత్యం వేల‌కొల‌ది మంది ప్ర‌యాణించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే రైల్వేలో ప్రయాణం చేస‌ట‌ప్పుడు చాలా మంది రిజ‌ర్వేష‌ణ్ చేసుకుంటారు. సాధారణంగా ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్టు ఉన్న టికెట్లకు బెర్త్‌లు 50:50 నిష్పత్తిలో దొరుకుతుంటాయి. అయితే కొన్నిసార్లు కంగారుగా అప్పటికప్పుడు ప్రయాణం చేయాలనుకున్నవారు తత్కాల్‌లో టికెట్లు బుక్ చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే త‌త్కాల్ ఓపెన్ చేయ‌గానే క్ష‌ణాల‌లో టిక్కెట్స్ అయిపోతుంటాయి. కొంద‌రికి మాత్ర‌మే అందులో ఛాన్స్ దొర‌కుతుంది. అయితే తత్కాల్‌లో బెర్త్ కన్ఫామ్ చేసుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా..? తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు కచ్చితంగా ఎలాంటి నియ‌మాలు పాటించాలి అంటే..!

రద్దీ ఎక్కువగా ఉండే సీజన్‌లో, వీకెండ్ సెలవులకు, ఎలాంటి ప్రణాళిక లేని లేదా అనుకోని ప్రయాణాలు చేయాల్సివచ్చినపుడు ఒక్కోసారి రైలు టికెట్స్ అన్నీ బుక్ అయిపోయి ఉంటాయి. అయినప్పటికీ చివరి నిమిషంలో టికెట్ పొందాలంటే IRCTCలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే, తత్కాల్ బుకింగ్‌లో చాలా మంది ఒకేసారి టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడం అంత సులభం కాదు. ఇందుకోసం మీరు చురుకుగా, చాలా వేగంగా స్పందించాల్సి ఉంటుంది. కొన్ని ఉపాయాలు పాటించడం ద్వారా తత్కాల్ టిక్కెట్‌ను మనం దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం కొన్ని విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి.

How To Book Tatkal Tickets with confirmed berth in telugu
How To Book Tatkal Tickets

సాధారణంగా ఎయిర్ కండిషన్ కోచ్‌లలో బెర్త్ కోసం తత్కాల్ టిక్కెట్ బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది, అదే నాన్-ఏసి కోచ్‌లలో బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు తత్కాల్ టిక్కెట్ బుకింగ్ ప్రారంభానికి ముందే సిద్ధంగా ఉండాలి. ఇక టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లో టిక్కెట్‌ను బుక్ చేస్తున్నప్పుడు, మీ ప్రయాణ వివరాలు, ప్రయాణికుల వివరాలు, క్యాప్చా మొదలగు అన్నీ కాలమ్స్ నింపడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి తత్కాల్ బుకింగ్ ప్రారంభమయిన తర్వాత ఈ వివరాలన్నీ నింపుకుంటూ కూర్చుంటే ఈ కొద్ది అంతరంలోనే ఉన్న టిక్కెట్లన్నీ అమ్ముడైపోయి, మీరు వెయిటింగ్ లిస్ట్‌లోకి వచ్చేస్తారు. కాబట్టి ఈ వివరాలన్నీ ముందుగానే నింపుకొని ఉంటే మంచిది. తత్కాల్ టికెట్లను బుక్ చేసేటప్పుడు.. ఆప్షన్‌గా తత్కాల్‌ను బదులుగా ప్రీమియం తత్కాల్‌ను ఎంచుకోండి. కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి. కానీ బెర్త్ మాత్రం మీకు 90 శాతం దొరుకుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago