How To Book Tatkal Tickets : రైల్వేలో నిత్యం వేలకొలది మంది ప్రయాణించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే రైల్వేలో ప్రయాణం చేసటప్పుడు చాలా మంది రిజర్వేషణ్ చేసుకుంటారు. సాధారణంగా ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్టు ఉన్న టికెట్లకు బెర్త్‌లు 50:50 నిష్పత్తిలో దొరుకుతుంటాయి. అయితే కొన్నిసార్లు కంగారుగా అప్పటికప్పుడు ప్రయాణం చేయాలనుకున్నవారు తత్కాల్‌లో టికెట్లు బుక్ చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తత్కాల్ ఓపెన్ చేయగానే క్షణాలలో టిక్కెట్స్ అయిపోతుంటాయి. కొందరికి మాత్రమే అందులో ఛాన్స్ దొరకుతుంది. అయితే తత్కాల్‌లో బెర్త్ కన్ఫామ్ చేసుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా..? తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు కచ్చితంగా ఎలాంటి నియమాలు పాటించాలి అంటే..!
రద్దీ ఎక్కువగా ఉండే సీజన్‌లో, వీకెండ్ సెలవులకు, ఎలాంటి ప్రణాళిక లేని లేదా అనుకోని ప్రయాణాలు చేయాల్సివచ్చినపుడు ఒక్కోసారి రైలు టికెట్స్ అన్నీ బుక్ అయిపోయి ఉంటాయి. అయినప్పటికీ చివరి నిమిషంలో టికెట్ పొందాలంటే IRCTCలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే, తత్కాల్ బుకింగ్‌లో చాలా మంది ఒకేసారి టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడం అంత సులభం కాదు. ఇందుకోసం మీరు చురుకుగా, చాలా వేగంగా స్పందించాల్సి ఉంటుంది. కొన్ని ఉపాయాలు పాటించడం ద్వారా తత్కాల్ టిక్కెట్‌ను మనం దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం కొన్ని విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి.
సాధారణంగా ఎయిర్ కండిషన్ కోచ్‌లలో బెర్త్ కోసం తత్కాల్ టిక్కెట్ బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది, అదే నాన్-ఏసి కోచ్‌లలో బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు తత్కాల్ టిక్కెట్ బుకింగ్ ప్రారంభానికి ముందే సిద్ధంగా ఉండాలి. ఇక టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లో టిక్కెట్‌ను బుక్ చేస్తున్నప్పుడు, మీ ప్రయాణ వివరాలు, ప్రయాణికుల వివరాలు, క్యాప్చా మొదలగు అన్నీ కాలమ్స్ నింపడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి తత్కాల్ బుకింగ్ ప్రారంభమయిన తర్వాత ఈ వివరాలన్నీ నింపుకుంటూ కూర్చుంటే ఈ కొద్ది అంతరంలోనే ఉన్న టిక్కెట్లన్నీ అమ్ముడైపోయి, మీరు వెయిటింగ్ లిస్ట్‌లోకి వచ్చేస్తారు. కాబట్టి ఈ వివరాలన్నీ ముందుగానే నింపుకొని ఉంటే మంచిది. తత్కాల్ టికెట్లను బుక్ చేసేటప్పుడు.. ఆప్షన్‌గా తత్కాల్‌ను బదులుగా ప్రీమియం తత్కాల్‌ను ఎంచుకోండి. కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి. కానీ బెర్త్ మాత్రం మీకు 90 శాతం దొరుకుతుంది.