Torn Currency Notes : చాలా మంది దగ్గర చిరిగిన లేదా మురికి పట్టిన కరెన్సీ నోట్లు ఉంటాయి. అవి ఎలా మార్పిడి చేసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఏటీఎంలో మనీ విత్‌డ్రా చేసినప్పుడు, పెద్ద మొత్తంలో అమౌంట్ అందుకున్నప్పుడు, ఇతర మార్గాల్లో తడిసిన లేదా చిరిగిపోయిన కరెన్సీ నోట్లు కూడా వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. భారతదేశంలో ద్రవ్య పరపతి వ్యవహారం అంతా ఆర్బీఐ కనుసన్నల్లోనే నడుస్తుంది. కరెన్సీ నోట్లు, నాణేల ముద్రణ, చెలామణి, మార్పు వంటి అన్ని విషయాలు ఆర్బీఐ పర్యవేక్షణలోనే జరుగుతుంది. అయితే, నకిలీ నోట్ల చెలామణి విపరీతంగా పెరిగిపోవడంతో.. 2016లో నోట్ల రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ.
మనం ఏదైనా వస్తువుల్ని విక్రయించినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులొస్తే లెక్కపెట్టి హడావుడిలో లోపల పెట్టుకుంటాం. తీరా అందులో కొన్ని డ్యామేజ్ అయి ఉండొచ్చు. పెద్ద నోట్లు రూ. 500 వంటివి చిరిగిపోతే మనం నష్టపోయినట్లే కదా. ఇంకా కొన్ని సార్లు మనకు ఏటీఎంల్లో కూడా డ్యామేజ్డ్ నోట్లు వస్తుంటాయి. అప్పుడేం చేయాలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఎక్కడో మారుద్దామనుకున్నా కుదరక.. కమీషన్ ఇచ్చి మరీ మార్పించుకుంటుంటారు. అయితే వీటికి ఒక పరిష్కారం ఉంది.ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి మీరు చిరిగిన/తడిసిన/టేప్ అతికించిన నోట్లను మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ ఇంకా చాలా సులభం కూడా. దేశంలోని అన్ని బ్యాంకులు కూడా చిరిగిన లేదా దెబ్బతిన్న కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.
అలాంటి నోట్ల స్థానంలో కొత్త నోట్లను ఇవ్వాల్సి ఉంటుంది.రెండు ముక్కలుగా చిరిగిన నోటులో.. ఆ రెండు ముక్కలు కూడా ఒకే నోటువి అయి ఉండాలి. వాటి ముఖ్యమైన ఫీచర్స్ ఏవీ మిస్ కాకూడదు. అలాంటి నోట్స్ ను బ్యాంక్ లు నిరభ్యంతరంగా మార్పిడి కోసం స్వీకరిస్తాయి.వ్యక్తులు రోజుకు గరిష్టంగా రూ.5,000 విలువ చేసే 20 నోట్లను బ్యాంకుల్లో ఉచితంగా మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు మార్పిడి చేసే కరెన్సీ నోట్ల విలువ రూ. 5 వేలు దాటినా, లేదా ఆనోట్ల సంఖ్య 20 దాటినా.. బ్యాంక్ లు వాటిని స్వీకరిస్తాయి. కానీ, వాటి మార్పిడికి సర్వీస్ చార్జ్ ను వసూలు చేస్తాయి. ఒకవేళ ఆ నోట్ల విలువ రూ.50,000 కంటే ఎక్కువ ఉంటే.. బ్యాంకులు తనిఖీ చేసి నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…