HIT 2 Movie : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు అచ్చొచ్చిన థ్రిల్లర్ జానర్‌లో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. ఈ ఏడాది మేజర్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్‌హిట్ కొట్టిన అడివిశేష్.. రీసెంట్‌గా హిట్-2తో మరో బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్ ది ఫస్ట్ కేస్’ సీక్వెల్ గా శైలేష్ కొలను హిట్2 ను కూడా మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమింట్స్‌తో ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను నిర్మించారు.
చిత్రంలో మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ కథానాయికలుగా నటించారు. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని భారీగా వసూళ్లు రాబట్టింది. లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం.. హిట్ 2 ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఈ శుక్రవారం (జనవరి 6) నుండి ప్రతి ప్రైమ్ యూజర్‌కి సినిమా అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది.. అయితే ఈ మూవీ పేయిడ్ కాటగిరీ లో పెట్టారు మేకర్స్.. ఎవరైనా సరే ఈ మూవీ చూడటానికి రూ.129 రెంట్ చెల్లించాల్సి ఉంటుందట.
సబ్ స్క్రైబర్స్‌కి ఎలాంటి రెంట్ లేకుండా హిట్2 మూవీని అమెజాన్ ఉంచాలని అనుకుంటుందట. అది ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. సంక్రాంతి తర్వాత అనే ప్రచారం మాత్రం జరుగుతోంది. అడవి శేష్ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. క్రిమినల్స్‌వి కోడి బుర్రలంటూ ఎగతాళి చేసే అడవి శేష్‌కి ఓ క్రూరమైన మర్డర్ కేసుతో పెద్ద సవాల్ ఎదురవుతుంది. అమ్మాయి మర్డర్ కేసు దర్యాప్తులో వేర్వేరుగా తెగి పడి ఉన్న అవయవాలు నలుగురు అమ్మాయిలవి అని తెలియడంతో మూవీ ఇంటస్ట్రింగ్‌గా మారింది.. ఈ హత్యలు చేస్తున్న కిల్లర్ ఎవరు? ఎందుకు ఆ అమ్మాయిల్ని టార్గెట్ చేశాడు? క్రిమినల్‌ని హీరో ఎలా పట్టుకున్నాడు? అనేది సినిమాలో ఆసక్తిగా చూపించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…