Naresh : సీనియర్ యాక్టర్ నరేష్ కొన్నాళ్లుగా తన రిలేషన్ షిప్ విషయంలో వార్తలలో నిలుస్తున్నాడు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ ఇప్పుడు నాలుగో పెళ్లికి కూడా సిద్ధమవుతున్నాడు. నరేష్, నటి పవిత్రా లోకేష్‌ను వివాహం చేసుకోబోతున్నారు అంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై వీరిద్దరూ వేర్వేరుగా స్పందించారు. ఇక పవిత్రా లోకేష్ వ్యక్తిగత, వైవాహిక జీవితానికి సంబంధించిన పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల నరేష్ త్వరలో తాను పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు.
ఈ వయస్సులో కూడా రొమాంటిక్ వీడియో షూట్ చేసి మరీ.. కొత్త సంవత్సరంలో పవిత్రకి లిప్ లిక్ ఇస్తూ తమ ప్రేమ విషయాన్ని చెప్పుకొచ్చాడు. మరి పవిత్రని పెళ్లి చేసుకోబోతున్న నరేష్ మొన్నటి వరకూ పోరాడిన రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చేశాడా అనే డిస్కషన్లు ఎక్కువయ్యాయి ఫిల్మ్ సర్కిల్ లో. విడాకులు తీసుకుంటే భార్యకు భర్త భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రమ్య రఘుపతికి నరేష్ ఎంత భరణం చెల్లించాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినీ వర్గాల సమాచారం మేరకు రేష్ తన మూడో భార్య రమ్యకు 5 కోట్లకు భరణంగా ఇచ్చాడని, ఇద్దరు కుటుంబాలకు సబంధించిన పెద్దలు, లాయర్ల సమక్షంలో ఈ నిర్ణయానికి వచ్చి మేటర్ సెటిల్ చేసారనే టాక్ నడుస్తుంది.
కొద్ది రోజుల క్రితం నరేష్ మూడో భార్య రమ్య.. పవిత్ర, నరేష్‌లపై మండిపడింది. నా భర్త మరో మహిళతో కలిసి తిరగడం సరికాదు. భర్తకు విడాకులు ఇవ్వను, అందరి ముందు ఆయనను పెళ్లి చేసుకున్నాను, వారికి పోలీసులు అండగా ఉండడం ఏమిటి అని ప్రశ్నించింది. వారిద్దరు కలిసి ఎలా ఉంటారో చూస్తానని శపథం చేసింది. ఆ మధ్య మైసూరులో నరేష్, పవిత్ర ఓ హోటల్లో ఒకే గదిలో ఉండగా, రమ్య అక్కడకొచ్చి ఇద్దరితో గొడవకు దిగింది. హోటల్ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నా ఆమె శాంతించలేదు రమ్య గట్టిగా అరుస్తూ చెప్పు తీసుకుని వారి మీద దాడి చేయడానికి యత్నించింది. మొత్తానికి డబ్బుతో నరేష్ మేటర్ సెటిల్ చేసాడని పలువురు చెప్పుకొస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…