Hit 2 Movie Collections : విశ్వక్ సేన్ హీరోగా ‘హిట్ ది ఫస్ట్ కేస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన శైలేష్ కొలను వరుసగా హిట్ ఫ్రాంచైజీలో సినిమాలని తెరకెక్కించే పనిలో పడ్డాడు. హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందిన మరో చిత్రం ‘హిట్ 2 ది సెకండ్ కేస్. ఇందులో అడివి శేష్ హీరోగా నటించారు. మీనాక్షి హీరోయిన్‌గా నటించింది. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తోన్న హిట్ 2 మూవీ డిసెంబర్ 2న విడుదలై భారీ విజయాన్ని అందుకొన్నది. సోమవారం అన్ని ప్రాంతాలలో బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే నైజాం, ఓవర్సీస్‌లో ఈ సినిమాకు బ్రేక్‌ఈవెన్ పూర్తయింది.
హిట్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 15 కోట్లుగా అంచనా వేశారు. దాంతో ఈ సినిమా ఇప్పటి వరకు 14.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. వారాంతంలోనే ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించడం విశేషంగా మారింది. ఇప్పటి వరకు $95,615 గ్రాస్ వసూలు చేసింది, మొత్తం $781,621కి చేరుకుందని అంటున్నారు.. ఈ సినిమా నైజాం హక్కుల విలువ 4 కోట్లు కాగా, 3 రోజుల్లో 5 కోట్లకు పైగా కొల్లగొట్టింది. కోవిడ్ తర్వాత, కొన్ని సినిమాలు మాత్రమే క్లీన్ హిట్ కొట్టాయి. వాటిలో హిట్ 2 ఒటి. థ్రిల్లర్ జానర్‌లోని సినిమాలు ఇటీవలి కాలంలో పెద్దగా సక్సెస్ కాలేదు.
అడివి శేష్ నటించిన ఈ చిత్రం క్లీన్ హిట్ కొట్టింది. ఇక మూడవ కేసులో హీరోగా నాని నటించనున్నాడు. ఈ సినిమాని ముఖ్యంగా యువత చూస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కధానాయికగా నటించింది. ఆదివారం నాడు ఈ సినిమా నందమూరి బాలకృష్ణ కూడా చూసి చాలా బాగుంది అని చెప్పటం తో సినిమాకి మరింత హైప్ వచ్చిందని సమాచారం. ఇప్పటికే కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా అడివి శేష్ కెరీర్ లో బెస్ట్ అవుతుందని అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…