OTT : ప్రతివారం ఓటీటీలో పలు చిత్రాలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే. థియేటర్స్‌లో కన్నా ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలపై ప్రేక్షకులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాల విషయానికి వస్తే ముందుగా మాచర్ల నియోజకవర్గం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దమైంది. నితిన్ హీరోగా ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. వరల్డ్ వైడ్‌గా ఆగస్టు 12న విడుదలైన ఈ సినిమా నితిన్‌కి నిరాశనే మిగిల్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న జీ5లో స్ట్రీమ్ చేయనున్నారు.
యశోద సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందగా, ఇందులో సమంత సరోగసీ మదర్‌గా నటించింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని బెదిరింపు పరిస్థితుల నుంచి బయటపడి మెడికల్ క్రైమ్ రాకెట్‌ను ఎలా దెబ్బతీస్తుంది అనేది ఈ సినిమా సారాంశం.. పెద్ద స్క్రీన్‌పై ఈ సినిమాని మిస్ అయిన వారు డిసెంబర్ 9 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సమంతా మంత్రముగ్ధమైన నటనను ఆస్వాదించవచ్చు. అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ ప్రధాన పాత్రలలో నటించిన రోమాంటిక్ ఎంటర్టైనర్ ఊర్వశివో రాక్షసివో . ఇందులో చాలా కామెడీ ఉంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, ప్రధాన నటీ నటుల మధ్య కెమిస్ట్రీ చూడదగిన చిత్రంగా మార్చింది. ఆహా వీడియోలో డిసెంబర్ 9నుండి ఈ సినిమా ప్రీమియర్ షో వేయనున్నారు.
ఇక లైక్ షేర్ చేయండి సబ్స్క్రయిబ్ విషయానికి వస్తే … మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఉల్లాసకరమైన ఎంటర్‌టైనర్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రం సోనీలివ్‌లో అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ కానుంది.ఇక విట్ నెస్ అనే తమిళ చిత్రం కూడా డిసెంబర్ 9 నుండి సోనిలివ్‌లో స్ట్రీమ్ కానుంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి మరియు ఇతరులు ప్రధాన పాత్రలు పోషించగా, సాంఘిక నాటకంగా ఈ మూవీ రూపొందింది. మరి ఇందులో ఏ చిత్రం ఓటీటీ ప్రేక్షకులని ఎక్కువగా అలరిస్తుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…