Hansika : యాపిల్ బ్యూటీ హన్సిక ఎట్టకేలకు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.హన్సిక మోత్వానీ వివాహం వ్యాపారవేత్త సొహైల్ కతూరియాతో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. రాజస్థాన్ జైపూర్‌లోని ఓ కోటలో సింధీ సంప్రదాయం ప్రకారం వీరు వివాహం జరగగా, పెళ్లి వేడుకలో పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సందడి చేశారు. గత వారం నుంచే హన్సిక పెళ్లి సందడి మొదలు కాగా, శుక్రవారం సూఫీ నైట్ వేడుకను ఘనంగా జరిపారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా వధూవరులు పలు పాటలకు డ్యాన్సులు చేసి సందడి చేశారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సింధి సంప్రదాయంలో జరిగిన పెళ్లిలో, కుటుంబసభ్యులు, సన్నిహితులు తెగ హంగామా చేశారు. కాగా.. సొహైల్ కు రెండో వివాహం కావడం గమనార్హం. హన్సిక స్నేహితురాలితోనే ఆయనకు తొలి వివాహం అయింది. కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. ఆ తర్వాత హన్సిక, సొహైల్ మధ్య ప్రేమాయణం సాగింది. ఈ క్రమంలోనే పెళ్లి పీలెక్కారు. తెలుగు, తమిళంలో హన్సిక ఎక్కువ సినిమాలు చేశారు. ఇటీవలే ఆమె 50వ సినిమా విడుదలయింది.
హీరో హీరో శింబుతో హన్సిక డేటింగ్‌లో ఉందంటూ గతంలో అనేక వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి చాలా సార్లు కెమెరా కంటికి చిక్కారు ఏమైందో ఏమో కాని శింబుతో విడిపోయిన హన్సిక సోహైల్‌ని వివాహం చేసుకుంది. చాలా కాలంగా వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఉందని, అతను తనబిజినెస్ పార్టనర్ అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అతనితో పరిచయం మరింత పెరిగి, అది మ్యారేజ్ వరకు వెళ్లిందని టాక్ కూడా ఉంది.. ఆ మధ్య ఈఫిల్ టవర్ ఎదురుగా హన్సికకి సోహైల్ ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా హన్సిక ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…