Bandla Ganesh : బండ్ల గణేష్.. కమెడీయన్ కమ్ నిర్మాతగా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ఇటీవలి కాలంలో వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు. ఆ మధ్య పూరీ జగన్నాథ్‌పై సంచలన కామెంట్స్ చేసిన బండ్ల తాజాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరై, అల్లు బాబీని పక్కనే పెట్టుకుని కొన్ని వ్యాఖ్యలు చేయగా, ఇవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా బండ్ల గణేష్ ట్విట్టర్ లో, సినిమా ఈవెంట్స్ లో చేసే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతుంటాయి.. కొన్ని సార్లు వివాదంగా మారి బండ్ల గణేష్ కి చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. అయినప్పటికీ మనోడి పంథా మారదు.
తాజాగా బండ్ల గణేష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఈ సారి ఏకంగా బండ్ల గణేష్ అల్లు బ్రదర్స్ పై ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీతో కలిసి ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరైన బండ్ల గణేష్.. ముందుగా ఆయనతో కలసి మాటలు కలిపి ఆ తర్వాత ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. అల్లు బాబీని పక్కనే పెట్టుకుని బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అందరికి చెబుతున్నా.. దయచేసి తండ్రి మాట వినొద్దు. తండ్రి మాట వింటూ పెరిగితే మా బాబీ గారిలా అవుతారు. తండ్రి మాట వినకుండా నచ్చింది చేస్తే మా హీరో బన్నీగారిలా అవుతారు. బాబీగారిలా కావాలా, బన్నీగారిలా అవ్వాలా అనేది మీరే నిర్ణయించుకోండి.
అల్లు బాబీ గారు చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని తండ్రి మాట వింటూ పెరిగారు. అందుకే ఇలా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చింది చేసుకుంటూ వెళ్లడంతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కాబట్టి ప్రతి ఒక్కరు సొంత నిర్ణయాలు తీసుకోండి అంటూ బండ్ల గణేష్ కామెంట్ చేయగా, ఈ వ్యాఖ్యలు బాబీని కించపరిచే విధంగా ఉన్నాయి. బండ్ల గణేష్ కామెంట్స్ ని బాబీ సరదాగా తీసుకుని నవ్వేసిన.. నెటిజన్లు మాత్రం బండ్ల గణేష్ పై విరుచుకుపడుతున్నారు. అన్నదమ్ముల మధ్య ఎందుకు పుల్లలు పెడతావు అంటూ ఫైర్ అవుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…