చాలామంది చల్లగా.. చిల్‌గా ఉండే ఫ్రిజ్ వాటర్ తాగేందుకే ఇష్టపడతారు. అయితే, దాని వల్ల ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ. చల్లని నీరు అనేక వ్యాధులకు ఆహ్వానం పలుకుతుంది. అందుకే వైద్యులు గది ఉష్ణోగ్రతతో సమానమైన నీళ్లు (నార్మల్ వాటర్) తాగడం మంచిదని చెబుతారు. నీరు తాగమన్నారు కదా అని చల్లని నీరు మాత్రం తాగకూడదు. వీలైతే గోరు వెచ్చని నీటిని తాగండి. ముఖ్యంగా ఉదయం వేళల్లో.. దీన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. చలికాలంలో ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
ఉదయం నిద్రలేవగానే.. కాలకృత్యాలు తీర్చుకోడానికి ముందే 2 లేదా 3 గ్లాసుల గోరు వెచ్చని నీరు తాగండి. నీటిని గడగడా తాగేయకుండా.. నోటిలోనే ఉంచుకుంటూ గుటకలు వేస్తూ తాగండి. రోజూ ఉదయం నిద్రలేవగానే వేడి నీళ్లు తాగడం వలన బరువు తగ్గుతారు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్స్‌లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని రక్షిస్తుంది. అంతేకాకుండా.. ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చాలామంది బరువు తగ్గడానికి వేడి నీళ్లు తాగుతారు.
అయితే ఉదయంతో పాటు రాత్రిళ్లు కూడా వేడి నీళ్లు తాగితే సులభంగా బరువు తగ్గుతారు. శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది. ఉబకాయం, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు వేడి నీరు తాగడం చాలా మంచిది. వేడినీరు తాగడం వలన అజీర్థి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి కడుపులో నుంచి బయటకు వచ్చే జీర్ణరసాల స్రావాన్ని వేడి నీరు పెంచుతుంది. అంతేకాకుండా గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. వేడి నీటిని తాగడం వలన మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇవే కాకుండా జీర్ణ వ్యవస్థ సమస్యలు తగ్గుతాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…