పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలన్నీ ట్రెండ్ సెట్ చేసినవే. పవన్ కల్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆ మధ్య కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ రికార్డులు బద్దలుకొట్టింది. గబ్బర్ సింగ్ తరువాత వచ్చిన అత్తారింటికి దారేది మూవీ సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఇందులో పవన్ కల్యాణ్ కు జోడీగా సమంత నటించింది. ఇక ఈ సినిమాలో కామెడీ, ఎమోషనల్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయి.
సినిమాలోని క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆ సీన్ లో పవన్ కల్యాణ్ తన అత్తను ఇంటికి రావాలంటూ చెప్పే డైలాగులకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ సినిమాల్లో ఎన్నో లాజిక్ లు ఉంటాయి. కానీ అత్తారింటికి దారేది సినిమాలో మాత్రం త్రివిక్రమ్ ఓ లాజిక్ ను మిస్ అయ్యారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. పవన్ కల్యాణ్ ఫ్రస్టేషన్ లో ఉన్న సమయంలో కమెడియన్ అలీ వచ్చి సిగరెట్ తీసుకురావాలని కోరుతాడు. అప్పటి వరకూ పవన్ ను అలీ డ్రైవర్ అనుకుంటాడు. దాంతో అప్పటికే ఇంట్లో గొడవ జరిగి ఫ్రస్టేషన్ లో ఉన్న పవన్ అలీని చితకబాదుతాడు.
ఆ తరవాత పాపం అనిపించి పిలిచి డబ్బులు ఇస్తాడు. ఏకంగా సూట్కేస్ చేతిలో పెట్టి ఇందులో ఎంత ఉందో తెలియదు తీసుకుపో అని చెబుతాడు. అప్పటికే ఎంఎస్ నారాయణ సూట్కేస్ ను ఓపెన్ చేసి పవన్ కు ఇస్తాడు. పూర్తిగా ఓపెన్ చేయకుండా దాని లాక్ ను అన్ లాక్ చేసినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. కానీ అలీ ఆ సూట్కేస్ పక్కకు తీసుకెళ్లి దీని తాళం ఇవ్వలేదు అని అడుగుతాడు. దాంతో పవన్ అప్పటికే తెరిచి ఉన్న సూట్కేస్ ను సుత్తితో పగటగొట్టి అలీ చేతిలో ఒక నోట్ల కట్ట మాత్రమే పెడతాడు. కాగా అల్రెడీ లాక్ తీసి ఉన్న సూట్కేస్ ను పగలగొట్టడం ఏంటి.. ఇదెక్కడి లాజిక్ గురువుగారూ అంటూ త్రివిక్రమ్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…