యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ఫరియా అబ్దుల్లా. ఈ మూవీతో తనదైన కామెడీ టైమింగ్‌తోనే కాకుండా హైట్ పరంగానూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇటీవల బంగార్రాజు మూవీతో వెండితెరపై అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఇటీవల అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఫరియా.. తన కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
ఫరియా అబ్దుల్లా కెరీర్ గురించి సరదా ప్రశ్నలు వేసిన అలీ.. జాతిరత్నాలు షూటింగ్ టైమ్‌లో ఆ మూవీ డైరెక్టర్ అనుదీప్ కొట్టడంపై ప్రశ్నించాడు. కానీ ఆ ప్రశ్నకి ఫరియా ఎలాంటి తడబాటు లేకుండా ఏం సమాధానం చెప్పిదంటే.. జాతిరత్నాలు షూటింగ్ టైమ్‌లో అది ఏదో సరదాగా జరిగింది. అనుదీప్‌కి ఒక అలవాటు ఉంది. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ వెంటనే పక్కన ఉన్న వాళ్లని సరదాగా కొడుతుంటాడు. ఆ రోజు నేను ఉన్నా.. నన్ను చేత్తో అలా అన్నారు అంతే..! అని వెల్లడించింది.
చివరిగా తనకి ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందని ఫరియా అబ్దుల్లా మనసులో మాటను బయట పెట్టింది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా.. ఫరియా కుటుంబం ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 4 సినిమాలు ఉన్నాయట. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఓటీటీలోనూ సందడి చేస్తుంది. ప్రస్తుతం ఫరియా నటిస్తోన్న లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చిత్రంలో యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ గాంధీ మేర్లపాక తెరకెక్కించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…