టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే అభిమానులకు విపరీతమైన క్రేజ్. ఆయన నటించిన సినిమాల్ని రీరిలీజ్ చేసుకుని మరీ చూస్తున్నారంటే వాళ్ల అభిమానం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి హీరోకి క్రేజీ డైరెక్టర్ దొరికితే ఆ సినిమాపై కూడా ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్, కరుణాకరన్ ల కాంబోలో వచ్చిన తొలిప్రేమ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఈ సినిమా వచ్చి 22ఏళ్లు అయినా పవన్ అభిమానుల్లో ఓ యూనిక్ క్రేజ్ ఉంది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో బాలు సినిమా వచ్చింది.
ఈ సినిమా కూడా మంచి హిట్ ను అందుకుంది. ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా అందర్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలుని ఫ్లాష్ బ్యాక్ లో ప్రేమించిన ఇందిరా ప్రియదర్శిని క్యారెక్టర్ చాలా అమాయకంగా, భయపడుతూనే, తన వాళ్ల కోసం ధైర్యంగా ఉండే అమ్మాయిగా నటించింది నేహా ఒబెరాయ్. క్యూట్ మాటలతో, చూపులతో బాలును లవ్ చేస్తూ.. ఇందిరా పాత్ర చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు. మరి ఈ పాత్రలో నటించిన నేహా ఒబెరాయ్ ఎవరంటే.. బాలీవుడ్ లో నిర్మాత అయిన ధరమ్ ఒబెరాయ్ కూతురు.
బాలు సినిమా తర్వాత జగపతిబాబు నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో యాక్ట్ చేసింది. కానీ ఆ సినిమా అంతగా హిట్ అవ్వలేదు. తర్వాత బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. 2010 లో ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకున్నారు నేహా ఒబెరాయ్. ఆమె ప్రజంట్ అయితే నోయిడాలోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కు మెంబర్ గా వర్క్ చేస్తున్నారు. మరి నేహా ఒబెరాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా.. లేదా అనేది తెలియాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…