చిరంజీవి, ప‌వన్‌ల‌తో ఉన్న ఈ వ్యక్తిని గుర్తు ప‌ట్టారా.. అత‌ను మరెవ‌రో కాదు..!

ఇటీవ‌ల సెల‌బ్రిటీల‌కు సంబంధించిన పాత ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సోష‌ల్ మీడియా వ‌ల‌న ఆ పిక్స్ తెగ వైరల్‌గా కూడా మారుతున్నాయి. తాజాగా చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌తో పాటు ఉన్న ఓ వ్య‌క్తికి సంబంధించిన పిక్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే అందులో ఉన్న వ్య‌క్తిని కొంద‌రు ఇట్టే గుర్తు ప‌ట్టేస్తే మ‌రి కొంద‌రు మాత్రం ఎవ‌రా అని ఆలోచిస్తున్నారు. అత‌ను ఎవ‌రో కాదు దేవి శ్రీ ప్ర‌సాద్ తండ్రి స‌త్యమూర్తి. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో 1953 మే 24న జన్మించిన స‌త్య‌మూర్తి… బీ.ఈడీ పూర్తి చేసి అనంత‌రం కళాశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు.

సాహిత్యం మీద ఉన్న అభిరుచి కార‌ణంగా చైతన్యం అనే నవల రాయడంతో ప్రారంభించారు. పవిత్రులు, పునరంకితం, దిగంబర అంబరం వంటి నవలలు సాహిత్య ప్రియులకు ఎంతగానో వినోదాన్ని పంచాయి. మానవ సంబంధాల మధ్య తలెత్తే సంఘర్షణను ఆధారం చేసుకుని ఆయన రాసిన కథలకు, నవలలకు కథా రచయితగా, నవలా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకోవ‌డంతో ఆ క్ర‌మంలోనే సినిమా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టారు. డైలాగ్ రైటర్ గా పలు సినిమాలకు పని చేశారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన దేవత సినిమాతో కథా రచయితగా ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న త‌ర్వాత ఎన్నో అవ‌కాశాలు అందిపుచ్చుకున్నారు. శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి హీరోలతో పని చేశారు.

have you identified gorthi sathya murthy in this photo

బావా మరదళ్ళు, కిరాయి కోటిగాడు, ఖైదీ నంబర్ 786, అభిలాష, పోలీస్ లాకప్, ఛాలెంజ్, బంగారు బుల్లోడు, భలే దొంగ, అమ్మ దొంగ, చంటి, పెదరాయుడు, మాతృదేవోభవ వంటి సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించారు. రచయితగా దాదాపు 90 సినిమాలకు పని చేసిన ఆయన.. దాదాపు 400 సినిమాలకు మాటల రచయితగా పని చేశారు. ఈయన తన కెరీర్ లో ఎక్కువగా చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలకు పని చేశారు. ఈయన 2015 డిసెంబర్ 14న చెన్నైలో మరణించగా, ఆయ‌న మ‌ర‌ణంతో దేవి శ్రీ ప్ర‌సాద్ ఎంతో కుమిలిపోయారు. ప్ర‌తి సంద‌ర్భంలోను తండ్రిని జ్ఞ‌ప్తికి తెచ్చుకుంటూనే ఉంటారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago