Naresh : టాలీవుడ్‌కి చెందిన సీనియర్ నటుడు వి.కె.నరేష్ ఇటీవల తరచు వార్తల్లో నిలుస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో చిత్రాల్లో హీరోగా మెప్పించిన ఈయన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. కొన్నాళ్ల పాటు రాజకీయాల్లోకి వెళ్లి రాణించే ప్రయత్నం చేసిన, అది కలిసి రాకపోవటంతో ఆయన సినిమాల్లోనే స్థిరపడ్డారు. ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలెన్నింటిలోనో నటిస్తూ మెప్పిస్తూ వస్తోన్న వి.కె.నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కూడా పని చేశారు. అయితే ఇటీవలి కాలంలో ఎప్పుడూ రానంతగా.. ఆయన పేరు వార్తల్లో వినిపిస్తోంది.
ఆరు పదులు వయసు దాటిన సీనియర్ నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. ఆయన పోకడపై పెద్ద గొడవే చేసింది. దీంతో అప్పటి వరకు నరేష్ పెళ్లిళ్లు గురించి పట్టించుకోని జనం, నెటిజన్స్.. ఆయన పెళ్లిళ్లపై ఆరా తీస్తున్నారు. సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను ముందుగా వివాహం చేసుకున్నాడు నరేష్. వీరికి ఓ కొడుకు. అతనే నవీన్ విజయ్ కృష్ణ అతను హీరోగా రెండు, మూడు సినిమాల్లోనూ నటించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు పుట్టారు. తర్వాత ఈమెతోనూ నరేష్ మనస్పర్ధలతో విడిపోయారు.
తర్వాత కాంగ్రెస్ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె అయిన రమ్య రఘపతిని పెళ్లి చేసుకోగా, వీరికి ఓ కొడుకు ఉన్నారు. ఇప్పుడు మళ్లీ నరేష్, మూడో భార్య రమ్య రఘపతికి విడాకుల నోటీసులు కూడా పంపారు. కానీ రమ్య రఘుపతి విడాకులు ఇవ్వనని చెప్పటం.. మీడియాకెక్కటంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. విడాకులు ఇవ్వకుండా పవిత్రని చేసుకునే పరిస్థిత లేదు. గతంలో విజయ నిర్మల సైతం తన మొదటి భర్తకి విడాకులు ఇవ్వకుండానే కృష్ణని పెళ్లి చేసుకుంది. అప్పుడప్పుడే నటిగా ఎదుగుతున్న సమయంలో విజయ నిర్మల చేసిన తప్పుడు పని ఆమెకు లేనిపోని కష్టాలని తెచ్చిపెట్టింది. అక్కినేని, ఎన్టీఆర్ ఆ సమస్యని ఏదోలా సాల్వ్ చేశారు. ఇప్పుడు కనుక నరేష్ విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకుంటే మాత్రం పెద్ద సమస్యలల్లో పడడం ఖాయంగా చెబుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…