Mahesh Babu : ఐదు పదుల వయస్సుకి దగ్గరగా ఉన్న మహేష్ బాబు ఇప్పటికీ కుర్ర హీరోలని మించిన అందంతో కనిపిస్తుంటారు. ఆయన అందానికి అలసు రహస్యం ఏంటో తెలియక చాలా మంది బట్టలు చించుకుంటూ ఉంటారు. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు .. టాప్ హీరోలలో ఒకరిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. చివరిగా సర్కారు వారి పాట చిత్రంతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నారు. త్వరలో ఆస్కార్ తెచ్చిపెట్టిన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాతో మహేష్ రేంజ్ పీక్స్ కి వెళ్లడం ఖాయం అంటున్నారు.
మహేష్ చాలా సాఫ్ట్‌గా ఉన్నా కూడా చేసే పనులు కొన్ని మాస్‌గా ఉంటాయట.ఒకప్పుడు మహేష్ బాబు సిగరెట్లు తెగ కాల్చేసేవాడంటారు ఆయన సన్నిహితులు. రోజుకు కనీసం 2 నుంచి 3 పెట్టెలు కాల్చేసిన రోజులు కూడా ఉన్నాయనే వార్తలున్నాయి. అతడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సిగరెట్లు బాగానే కాల్చేవాడని మహేష్ బాబుతో బాగా సన్నిహితంగా ఉన్నవాళ్లు చెబుతూ ఉంటారు. అయితే బాగా సిగరెట్స్ తాగే మహేష్ బాబు ఉన్నట్టుండి సడెన్ గా అవి మానేశాడు. పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయాడు. పిల్లలు పుట్టిన తర్వాత మరింత జెంటిల్ మెన్ అయిపోయాడు. అసలు సిగరెట్ల జోలికి వెళ్లకుండా పర్ ఫెక్ట్ పర్సన్ అయిపోయాడు సూపర్ స్టార్. అయితే ఈయన సిగరెట్లు మానేయడానికి ప్రధాన కారణం అలెన్ కార్ అనే రచయిత రాసిన బుక్.
ఈ పుస్తకాన్ని మహేష్ బాబుకు ఆయన స్నేహితుడు గిఫ్ట్ గా ఇవ్వగా, ఇందులో స్మోకింగ్ త్వరగా ఎలా మానేయాలి అని ఉంది. అది చదివి పొగ తాగడం వదిలేసాడు మహేష్. ఆ తర్వాత తన అభిమానులకు కూడా పొగ తాగొద్దు అంటూ చెప్పాడు మహేష్ బాబు. అసలు ఆ అలవాటు మార్చడానికి చాలా ట్రై చేసిందట మహేష్ బాబు అమ్మగారు . కృష్ణ కూడా చాలాసార్లు అరిచారట .అయినా కానీ ఎంగే ఏజ్ లో వచ్చిన అలవాటు మానలేక చాలా ఇబ్బందులు పడ్డారట. నమ్రతతో లవ్ లో ఉన్న సమయంలో కూడా మహేష్ కి స్మోకింగ్ అలవాటు ఉండిందట . అయితే నమ్రత ఆ బ్యాడ్ అలవాటును మార్చడానికి చాలా చాలా ట్రై చేసి ..ఎట్టకేలకు పెళ్ళికి ముందే అలవాటును మానిపించేసిందట. స్మోకింగ్ చేసే వాళ్లు అలాంటే పరమ అసహ్యం అని చెప్పి మహేష్ బాబును తన రూట్ లో కి రప్పించుకుంది నమ్రత.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…