Godfather Movie : ఆచార్య ఫ్లాప్ తర్వాత మెగాస్టార్‌కి కాస్త రిలీఫ్ ఇచ్చిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమా అని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాని మోహన్ రాజా డైరెక్ట్ చేయగా రామ్ చరణ్, ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి ఈ సినిమాను కొణిదల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. ఇందులో నయనతార , సత్యదేవ్, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇక సినిమా విడుదలైన తర్వాత సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే దక్కింది. కానీ అనూహ్యంగా కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా వెనుకబడింది. అయితేఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ సంస్థ సుమారు 56 కోట్ల రూపాయలకి దక్కించుకున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.నవంబర్ 19వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. సినిమా విడుదలైన సమయంలో ఓటీటీకి విధించిన ఎనిమిది వారాల గడువు పూర్తయిందని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మెగాస్టార్ క్రేజ్ క్యాష్ చేసుకోవాలని నెట్ ఫ్లిక్స్ సంస్థ భావిస్తోందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంకి థమన్ సంగీతం అందివ్వగా ఆయన మ్యూజిక్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి తనకు అచ్చొన్చిన ఖైదీ పాత్రలో అదరగొట్టారు. గతంలో వచ్చిన ‘ఖైదీ, ‘ఖైదీ నంబర్ 786’, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా, ఖైదీ నంబర్ 150 సినిమాలు సక్సెస్ అయ్యాయి. అదే కోవలో ఖైదీ గెటప్‌లో చిరంజీవి నటించిన ఈ సినిమా సెంటిమెంట్ ప్రకారం హిట్ అయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…