Godfather Movie First Review : మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తరువాత మళ్లీ గాఢ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటించిన గాడ్ ఫాదర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ కానుంది. భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించారు. దీంతో సినిమాపై అటు ప్రేక్షకులతోపాటు ఇటు ఫ్యాన్స్‌లోనూ భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే గాఢ్ ఫాదర్ మూవీ కోసం ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన తార్ మార్ అనే పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది.
పొలిటికల్ డ్రామా యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. మళయాళంలో హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లూసిఫర్ చిత్రం తెలుగులోనూ వచ్చింది. కనుక కథ అందరికీ ముందుగానే తెలుసు. అయితే దీన్ని మన తెలుగు నేటివిటీకి తగినట్లు తెరకెక్కించారు. మరోవైపు చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార వంటి స్టార్ నటీనటులు ఉండడంతో గాడ్ ఫాదర్‌పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇక ఈ మూవీకి గాను తాజాగా సెన్సార్ బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది.
ఈ మూవీని చూసిన వారి సమాచారం ప్రకారం.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. పొలిటికల్ డ్రామాగా ఎంతగానో ఆకట్టుకుంటుందని.. ముఖ్యంగా ఇందులో మెగాస్టార్ తన నటన, డైలాగ్స్ తో అందరినీ కట్టిపడేస్తారని అంటున్నారు. అలాగే సల్మాన్ యాక్టింగ్ కూడా సూపర్బ్ అని అంటున్నారు. ఇక ఇదే విషయాన్ని దర్శకుడు మోహన్ రాజా కూడా తెలియజేశారు. ఈ మూవీ రిలీజ్ కోసం తాను కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే మూవీ రిలీజ్ దగ్గరపడుతున్నా దీనిపై బజ్ లేదు. మరో వైపు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు. ఇదే మెగా ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. మరి ఆచార్య తరువాత రిలీజ్ అవుతున్న ఈ మూవీ అయినా హిట్ కొడుతుందా.. లేదా.. అన్నది మరి కొద్ది రోజులు వేచి చూస్తే తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…