Manchu Lakshmi : మంచు మోహన్ బాబు నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది మంచు లక్ష్మీ. కేవలం నటిగానే కాకుండా సింగర్‌గా, నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకుంది. అమెరికాలో ఉన్న సమయంలో కొన్ని హాలీవుడ్ సిరీస్‌లలో నటించిన మంచు లక్ష్మి ఇండియాకి వచ్చాక అనగనగా ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఆరంగేట్రం చేసింది. ఇందులో తన అద్భుతమైన నటనకు నంది అవార్డ్ కూడా అందుకుంది. ప్రస్తుతం సినిమాలతోపాటు టీవీ షోస్ కూడా చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది.
యూట్యూబ్‌లో సొంతంగా చానల్స్ నిర్వహిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఫిట్‌నెస్, సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. తాజాగా మంచు లక్ష్మీ ఆహాలో వంటకాల ప్రోగ్రాంతో అలరించబోతుందట. ఆహా చెఫ్ మంత్రా సీజన్ 2తో అందరిని మరోసారి అలరించడానికి సెప్టెంబర్ 30 నుండి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేస్తోంది. 8 ఎపిసోడ్స్ కలిగిన ఈ షోను ముందుండి నడిపించడానికి మంచు లక్ష్మి వచ్చేస్తుంది. తాజాగా ఆహా సంస్థ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో మంచు లక్ష్మీ గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసిపోతోంది. ఆమె లుక్ కంప్లీట్ డిఫెరెంట్ గా ఉంది. మంచు లక్ష్మిని ఇలా చూస్తూ నెటిజన్లు ఔరా అంటున్నారు.
చెఫ్ మంత్ర షోలో సెలెబ్రిటీలు అతిథులుగా హాజరు కానుండగా, వారితో వంటలు చేయిస్తూ ఫుడ్ విషయంలో వారి అభిరుచులు ఏంటి, వారు ఎలాంటి ఆహారం తింటారు లాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మంచు లక్ష్మీ. తొలి సీజన్‌కి మంచి ఆదరణ రావడంతో ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా రెండో సీజన్ మొదలు పెట్టారు. ఇక మంచు లక్ష్మీ ఏం మాట్లాడిన, ఏం చేసిన కొంతమంది ట్రోలర్స్ ఆమెను టార్గెట్ చేస్తూ.. నెగిటివ్‌గా ప్రచారం చేయడం కామన్‌గా మారింది. దీంతో ట్రోలర్స్‌కు ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇస్తూనే ఉంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…