Ginna Movie Review : మంచు విష్ణు జిన్నా మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

Ginna Movie Review : మంచు మోహ‌న్ బాబు న‌ట వార‌సుడు మంచు విష్ణు ఇటీవ‌లి కాలంలో స‌రైన స‌క్సెస్‌లు పొంద‌డం లేదు. మొనగాళ్లు లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత జిన్నా అనే మూవీ తో భారీ అంచనాల మధ్య మన ముందుకు వచ్చారు. మూవీ ట్రైలర్ మరియు ప్రచార కార్యక్రమాలు మనలో మరింత ఆసక్తిని పెంచాయి. ఎట్టకేలకు ఈ సినిమా అక్టోబర్ 21 న విడుదల కాగా, ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌..

జిన్నా పూర్తి పేరు.. గాలి నాగేశ్వరరావు. ఆయ‌న‌ని పూర్తి పేరుతో ఎవరైనా  పిలిస్తే కోపం వస్తుంది. అందుకే షార్ట్ కట్ లో ‘జిన్నా’ అంటూ పిలవాలనీ అంటుంటాడు. జిన్నాకు స్కూల్ టైమ్‌లో రేణుక (సన్ని లియోన్), స్వాతి (పాయల్ రాజ్ పుత్ )లతో మంచి స్నేహం ఉంటుంది. జిన్నాకు ఊరి నిండా అప్పులే.. స్వాతి అతనికి సాయం చేస్తుంటుంది. అయినా ఆ అప్పుల నుండి బయట పడలేక ఇబ్బందులు ప‌డుతుంటాడు. ఇక ఈ సమయంలో జిన్నా చిన్ననాటి ఫ్రెండ్ రేణుక ఇండియాకు తిరిగి వస్తుంది. ఆమెను పెళ్ళి చేసుకోవడానికీ రెడీ అవుతాడు. ఆ త‌ర్వాత క‌థ ఎటు వెళుతుంది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

Ginna Movie Review know how is the movie
Ginna Movie Review

ప‌ర్‌ఫార్మెన్స్..

జిన్నాగా మంచు విష్ణు కామెడీ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. ఢీ సినిమా ను గుర్తు చేశారు. విష్ణు డ్యాన్సులు చాలా బాగున్నాయి. పాయల్ రాజ్ పుత్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. సన్నీలియోన్ విషయానికి వస్తే తన గ్లామర్‌తో మరోసారి వావ్ అనిపించింది. చెప్పాలంటే తనదే సినిమాలో హైలెట్ పాత్ర. ఇక మిగతా పాత్రల్లో నటించిన వెన్నెలకిషోర్, సద్దాం, చంద్ర, నరేష్ కామెడీని తమదైన శైలిలో పండించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర కోసం రాసిన డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి.

ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనదైన శైలిలో వినోదాన్ని బాగానే అందించాడు. కోన వెంకట్ స్క్రీన్ ప్లే కూడా పరవాలేదనిపిస్తుంది. ఇక ఫస్టాఫ్ కంటే సెకాండ్ మరింత ఆకట్టుకుంటుంది. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది

ఫైన‌ల్‌గా.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా సాగినా, సెకండ్ హాఫ్ మరింత స్పీడ్ తో ఆడియెన్స్ ను అలరిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ లని ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.ఇందులో మంచు విష్ణు నటన..సన్నీలియోన్ క్యారెక్టర్.. ప్ల‌స్ పాయింట్స్ గా చెప్ప‌వ‌చ్చు. : రొటీన్ స్క్రీన్ ప్లే, పేలవమైన ప్రదర్శనలు మైన‌స్ పాయింట్స్.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 weeks ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago