Neelambari : సినిమాల్లోని కొన్ని పాత్రలు కొంత మందికి ఎంత పేరు ప్రఖ్యాతలు తెస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ఆ పాత్ర వారి కోసమే పుట్టిందా అనే అనుమానం కలుగుతుంది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రలో రమ్యకృష్ణ తప్ప మరొకరిని ఊహించుకోలేము. అలానే రజనీకాంత్ నటించిన నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్రకు రమ్యకృష్ణ తప్ప మరొకరు సూట్ కారని గట్టిగా చెప్పగలం. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటించలేదు. జీవించేసింది. ఆమె హావభావాలు ప్రేక్షకులని కట్టిపడేసాయి. ఆ పాత్రని వేరొకరు చేసి ఉంటే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యేది కాదు.
రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర కోసం ముందుగా ఆమెను అనుకోలేదట. ముందుగా నీలంబరి పాత్ర కోసం నగ్మా ను సంప్రదించారట దర్శకుడు రవికుమార్.ఇక ఆమెను కలిసి స్టోరీ వినిపించేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు.పాత్ర నచ్చినా డేట్స్ ఖాళీ లేకపోవడంతో చివరికి సినిమా వదులుకున్నారట. అనంతరం అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న మీనానా సంప్రదించాడట దర్శకుడు. అప్పట్లో మీనా ఏ పాత్ర చేయాలన్నది ఆమె తల్లి డిసైడ్ చేసేది అయితే మీనాకు పాత్ర నచ్చిన ఆమె తల్లికి నచ్చక పోవడంతో నీలాంబరి పాత్రకు మీనా కూడా దూరం అయింది.
ఇక ఆ సమయంలో రమ్యకృష్ణని అప్రోచ్ కావడం, ఆమె వెంటనే ఎస్ చెప్పడం చకాచకా జరిగిపోయాయి. అసలు నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ చూపిన నట విశ్వరూపం చూసి ప్రతి ఒక్కరు అవాక్కయ్యారు. ఆమె తప్ప ఈ పాత్రల ఎవరిని ఊహించుకోలేం అని అప్పట్లో అభిమానులు తెగ కామెంట్స్ చేసే వారు. ఏదేమైన రమ్యకృష్ణ కెరీర్‌లో ఇదొక బెస్ట్ రోల్ అని చెప్పక తప్పదు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…