ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి. ఆయన నటించి దర్శకత్వం వహించిన కాంతారా చిత్రం ఊహించని టాక్‌తో దూసుకెళ్తున్నది. కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే సంస్థ రూపొందించిన ఈ సినిమా రూపొందించగా, ఈ చిత్రం తొలి రోజు కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనాలు నమోదు చేస్తున్నది. ఈ మూవీ మెల్ల మెల్లగా దేశంలోని సినీ అభిమానుల ఆదరణను చూరగొంటున్నది. ఈ క్రమంలో రిషబ్ శెట్టి పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అతని గురించి తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. అయితే రిషబ్ శెట్టి లవ్ స్టోరీ సినిమాని మించే ట్విస్ట్ లతో ఉంది.
రిషబ్ శెట్టి భార్య పేరు ప్రగతి. ఒక సినిమా ఈవెంట్ లో వీరి మధ్య తొలి పరిచయం ఏర్పడింది. రిషబ్ శెట్టి.. రక్షిత్ శెట్టితో అనేక విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. అందులో కిర్రాక్ పార్టీ చిత్రం కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో ఒక చిత్రం ఈవెంట్ కి ప్రగతి హాజరైంది. ఆ ఈవెంట్ లో రిషబ్.. ప్రగతిని చూశారు. ఎక్కడో చూసినట్టు ఉందిగా అని ఆలోచిస్తూనే, ఇంటికి వెళ్లి ఆలోచిస్తూ ఫేస్ బుక్ ఓపెన్ చేశాడు. ఫేస్ బుక్ లో ఏడాది క్రితం ప్రగతి రిషబ్ కి ఫ్రెండ్ రిక్వస్ట్ పంపింది. వెంటనే యాక్సెప్ట్ చేయడం, ఇద్దరి మధ్య మాటలు కలవడం జరిగింది.
ఆ తర్వాత మనసులు కూడా కలిసాయి. అయితే ప్రగతి ఇంట్లో వారు రిషబ్‌ని రిజెక్ట్ చేశారు. సినిమా వాడని వద్దు అని అన్న వారు తర్వాత మెల్లగా ఒప్పుకున్నారు. ఇక పెళ్లి తర్వాత ప్రగతి ఐటి జాబ్ కూడా మానేసి రిషబ్ కి సపోర్ట్ గా నిలిచింది. సినిమాని మించిన ట్విస్ట్‌లతో వారి లవ్ స్టోరీ ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కాంతారా విషయానికి వస్తే ఈ చిత్రం గత 6 రోజుల్లో 21 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది. అయితే ఇందులో 20 కోట్లకుపైగా కర్ణాటక నుంచే వసూలు చేయడం రికార్డుగా మారింది. తొలి వారాంతం ముగిసే సమయానికి ఈ చిత్రం 25 కోట్ల మార్కును దాటేసే అవకాశం ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…