గీతా సింగ్ అంటే వెంటనే మనకు గుర్తుకు రాకపోవచ్చు. కాని కితకితలు హీరోయిన్ అంటే వెంటనే గుర్తు పట్టేస్తారు. ఈ అమ్మడు ఎవడి గోల వాడిదే, పోటుగాడు, శశిరేఖా పరిణయం, సీమ టపాకాయ్ వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన కామెడీతో మెప్పించింది. కితకితలు సినిమాలో అల్లరి నరేష్ సరసన ఆమె నటించగా, ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఆమె జీవితంలో ఎన్నో బాధాకర సంఘటనలు ఉన్నాయి. పలు సందర్భాలలో వాటి గురించి చెబుతూ చాలా బాధపడింది గీతా సింగ్ . తనను అయిన వాళ్లే డబ్బు కోసం వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారని, నమ్మినవాళ్లు దారుణంగా మోసం చేశారని బాధ పడ్డారు.
ఒకరి దగ్గర చిట్టీలు వేస్తే అతను ఏకంగా రూ. 6 కోట్లు మోసం చేశాడని ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పారు. సినిమాల్లో అవకాశాలు రాకపోవటంతో రెండుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని అయితే తన స్నేహితురాలు అండగా నిలబడటంతో తట్టుకోగలిగానని ఆమె అన్నారు. తను కితకితలు హీరోయిన్ గా చేసిన తరువాత కమెడియన్ గా చాలా సినిమాలు చేశానని చెప్పుకు రాగా, ఓ సారి షూటింగ్ లో ఇద్దరు హీరోయిన్లు తనను అవమానించారని. వారు ధారుణంగా మాట్లాడారని వెల్లడించింది. నా గురించి హీరోయిన్ ఏంటని చీప్‌గా మాట్లాడితే.. అప్పుడు అల్లరి నరేష్ ఆ హీరోయిన్‌లముందే .. తను నా ఫస్ట్ హీరోయిన్ అంటూ పరిచయం చేశాడని చెప్పింది గీతా సింగ్. దాంతో వారు ఆశ్చర్యపోవడంతో పాటు.. షాక్ కు గురయ్యారట.
ఇటీవల పెద్దగా కనిపించకపోవడంతో స్పందించిన గీతా సింగ్.. ఇండస్ట్రీలో ఇప్పుడు అసలు ఫీమేయిల్ ఆర్టిస్ట్ లకు పెద్దగా ఛాన్స్ లు లేవు అంటుంది. పురిషాధిక్యం పెరగడంతో..మా లాంటివారిని అసలు చూడటం లేదు అంటోంది గీతాసింగ్. ప్రస్తుతం తన అన్నయ్య పిల్లలను దత్తత తీసుకున్నానని, వారితోనే కలిసి ఉంటున్నానని చెప్పింది. తాను వివాదాలకు దూరంగా ఉంటానని, తన పనేదో తాను చేసుకుని వెళ్లిపోతానని కూడా ఆమె చెప్పారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…