ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గెలుస్తుందనుకున్న సౌతాఫ్రికా జట్టు ఓడిపోయింది. పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. గెలిస్తే సెమీస్‌కు వెళ్లే చక్కని అవకాశాన్ని సౌతాఫ్రికా మిస్ చేసుకుంది. ఎప్పటిలాగే ఒత్తిడికి లొంగిపోయింది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీని వల్ల పాక్‌కు సెమీస్ మార్గం మరింత సులభమైంది. ఆ జట్టుకు లక్ కలసి వచ్చినట్లయింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట ఫీల్డింగ్ తీసుకోగా.. నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో కోలిన్ అకర్‌మన్ 41 పరుగులతో నాటౌట్ నిలవగా, టామ్ కూపర్ 35 పరుగులు చేశాడు. స్టీఫెన్ మైబర్గ్ 37 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2 వికెట్లు తీశాడు. అన్‌రిచ్ నొర్‌జె, ఎయిడెన్ మార్కరమ్‌లు చెరో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చారు. దీంతో నెదర్లాండ్స్ పెద్దగా కష్టపడకుండానే సునాయాసంగా విజయం సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 3 వికెట్లు తీయగా, బస్ డి లీడి, ఫ్రెడ్ క్లాసెన్‌లు చెరో 2 వికెట్లు సాధించారు. అలాగే మీకెరెన్‌కు 1 వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే సౌతాఫ్రికా నేరుగా సెమీస్‌కు వెళ్లి ఉండేది. మొదటి లేదా రెండో స్థానంలో నిలిచేది. కానీ పసికూన జట్టు చేతిలో ఓటమి కారణంగా సెమీస్ ఆశలు గల్లంతు అయ్యాయి. దీంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు అవకాశం దక్కింది. ఈ రెండు జట్లలో గెలుపొందిన జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది. కనుక పాక్, బంగ్లా రెండు జట్లకు చాన్స్ ఉందని చెప్పవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…