Garikapati : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి రూపొందించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ నిలిచింది. అయితే ట్రిపుల్ ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇక తాజాగా ఈ పాట గురించి గరికపాటి తన ప్రవచనంలో ప్రస్తావించడం విశేషం. అచ్చ తెలుగులో రాసిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం సంతోషించాల్సిన విషయమని చెబుతూ..ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి కూడా గరికపాటి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాకు మొన్నటి వరకు ఆ పాట గురించి తెలీదు.
ఆ పాట ఎందుకు ఆ రేంజ్‌కి వెళ్లిందో తెలుసుకోవడానికి మా అబ్బాయి పిలిచి ఆ పాటేంటో పెట్టరా అని అరగంట కూర్చొని విన్నాను. ఇందులో ఇంగ్లిష్ మాటలు లేవు. అచ్చ తెలుగు పాట రాసిన చంద్రబోస్‌కి నమస్కారం. చాలా మంచి పాట రాశారు అని గరికపాటి ప్రశంసించారు. భగవంతుడి దయవల్ల మార్చి 13వ తేదీన పురస్కారం వస్తే మనంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరని గరికపాటి అన్నారు. ‘పురస్కారం రావాలని కాంక్షిద్దాం. సరస్వతీ దేవిని పూజిద్దాం. గుడిలోకి వెళ్తే దండం పెట్టండి పురస్కారం రావాలని. మనమంతా గర్వంగా తిరుగుతాం’ అని గరికపాటి తన అనుచరులకు తెలియజేశారు.
ఇక ‘నాటు నాటు’ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్‌ను ఆకాశానికి ఎత్తేశారు. చిన్నవాళ్లు అయిన వారికి నమస్కారం. ఇద్దరూ కూడబలుక్కుని నటన చేయడం ఏదైతే ఉందో కవలలై పుట్టినవారికి కూడా సాధ్యం కాదు. రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు ఇద్దరూ అటువంటి నటన చేశారంటే నా కంటే చిన్నవాళ్లైనా ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాను’ అని గరికపాటి ఎంతో గొప్పగా వర్ణించారు అని చెప్పాలి. ఆ పాట నేను రాస్తానేమో కాని అంత ఎనర్జీతో అయితే ఎగరలేను కదా అంటూ ఛలోక్తులు విసిరారు అని గరికపాటి వ్యాఖ్యానించారు.