Manchu Lakshmi : మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. మొన్నటి వరకు తన తమ్ముడు మనోజ్ పెళ్లి వేడుకలతో బిజీగా ఉన్న మంచు లక్ష్మీ అందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చింది. ఇక తాజాగా పోలీస్ ప్రవర్తనపై సీరియస్‌గా స్పందించింది మంచు వారమ్మాయి. మహిళలకు రక్షణగా నిలవాల్సిన ఒక పోలీస్ అధికారి.. అర్ధరాత్రి ఒక యువతి పాలిట రాక్షసుడిలా మారాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న యువతిని ఆపి ఆమెను చాలా వేధించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి, తాకరాని చోటల్లా తాకాడు.
బైక్ మీద కూర్చొని మహిళని చాలా వేధించాడు. అయితే ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. పోలీస్ అధికారి నిర్వాకాన్ని దగ్గరలో ఉన్న ఎవరో ఒక వ్యక్తి కెమెరాలో బంధించారు. ఈ వీడియోను భారత సంతతికి చెందిన స్వీడన్ ప్రొఫెసర్ అశోక్ స్వైన్ ట్వీట్ చేశారు. ‘మహిళకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా ఇండియా ఎందుకు అయ్యింది? ఆఖరికి పోలీస్ కూడా మధ్యప్రదేశ్‌లోని ఒక వీధిలో మహిళను లైంగికంగా వేధిస్తున్నాడు’ అని అశోక్ స్వైన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. నిజానికి రెండు వర్గాల మధ్య జరిగే ఘర్షణలు, లైంగిక వేధింపుల ఘటనలకు సంబంధించి వీడియోలను అశోక్ గతంలోనూ తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
అయితే తాజాగా అశోక్ ట్వీట్‌కు మంచు లక్ష్మి స్పందించారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ‘రక్తం మరిగిపోతోంది’ అని క్యాప్షన్ పెట్టారు. అంటే, వీడియోలో యువతిని పోలీస్ అధికారి వేధించడం చూసి మంచు లక్ష్మికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది అనేలా తన కామెంట్ లో తెలిపింది. గతంలో కూడా ఇలాంటి విషయాలపై మంచు లక్ష్మీ సీరియస్‌గా స్పందించింది. అయితే ప్రస్తుతం మంచు లక్ష్మి ట్వీట్‌కు పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. ఆ పోలీసు అధికారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Blood boils https://t.co/StR428okW0
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 9, 2023