Gangotri Child Artist Kavya : అల్లు అర్జున్ డెబ్యూ మూవీ గంగోత్రి చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా బన్నీకి డెబ్యూ అయినా కూడా చాలా బాగా నటించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 100వ సినిమా కూడా ఇదే కాగా ఇందులోని కీరవాణి పాటలు.. అదితి అగర్వాల్ గ్లామర్ సినిమాను సక్సెస్ అయ్యేలా చేశాయి. ఈ సినిమా పాటలలో వల్లంకి పిట్ట పాట ఇప్పటికీ అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాట వింటే సంగీత ప్రియులు అలా మైమరచిపోతుంటారు.
ఈ పాటలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన చిన్నారి కావ్య క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. గంగోత్రి సినిమా సమయంలో కావ్యకు నాలుగేళ్లు మాత్రమే. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకుంది కావ్య. గంగోత్రి తర్వాత కావ్యకు తెలుగులో చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్, శ్రియా జంటగా నటించిన బాలు సినిమాలో కూడా బాల నటిగా అలరించింది. అనంతరం అందమైన మనసు, అడవి రాముడు, విజయేంద్ర వర్మ వంటి సినిమాల్లో కనిపించింది. దాదాపు 12 చిత్రాల్లో బాలనటిగా నటనతో మెప్పించిన కావ్య స్టడీస్ వలన నటనకు బ్రేక్ ఇచ్చింది.
లా పూర్తి చేసి లాయర్‌గా కొనసాగుతున్న కావ్యకు ఇప్పటికీ నటనపై ఆసక్తి ఉందని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ట్రై చేస్తుంది. మసూద చిత్రంతో కావ్య హీరోయిన్ గా మారబోతుంది. ఇటీవల విడుదలైన పెళ్లి సందD చిత్రంలో హీరోయిన్ గా కావ్యను అనుకున్నారట. ఆమెకు అనుకోకుండా అవకాశం చేజారినట్లు తెలుస్తుంది. కావ్యలో హీరోయిన్ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి. అదృష్టం ఉంటే ఈ అమ్మడికి అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…