Jagadeka Veerudu Athiloka Sundari : చిరంజీవి, శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన దృశ్య కావం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో అనేక రికార్డులను క్రియేట్ చేసింది. అప్పట్లో ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్లు దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. అప్పట్లో ఈ చిత్రానికి బడ్జెట్ రూ.8 కోట్లు. ఇప్పుటి పరిస్థితులతో పోల్చుకొంటే దాదాపు 63 కోట్ల రూపాయలుగా అంచనా వేసుకోవచ్చు. అత్యాధునిక సాంకేతికతతో, గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేసి హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కించడం జరిగింది.
ఈ సినిమా 50 రోజులు 100 రోజులు కాకుండా ఏకంగా ఏడాది పాటూ థియేటర్లలో ఆడి అందరిని ఆశ్చర్యపరిచింది . మూడున్నర దశాబ్దాల క్రితం వచ్చిన ఈ సినిమాకు చిరంజీవి రూ.35 లక్షల పారితోషికం పుచ్చుకోగా శ్రీదేవి రూ.25 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. అప్పటి వీరి రెమ్యునరేషన్ ఇండస్ట్రీ టాపిక్‌గా మారింది. ఇక ఈ చిత్రం ప్రతికూల తుఫాన్ పరిస్థితులను ఎదురించి ప్రేక్షకులను థియేటర్‌కు పరుగులు పెట్టేలా చేసింది. ఈ చిత్రం 100 రోజులకు రూ.30 లక్షలకు పైగా రాబట్టింది.
జగదేకవీరుడు అతిలోక సుందరి ఎన్నో సంచలనాలు క్రియేట్ చేయగా, ఈ సినిమా 162 రోజులకు గాను రూ.40 లక్షల గ్రాస్ వసూలు చేయడం నైజాం ఏరియాలో ఓ సింగిల్ థియేటర్ అత్యధికంగా వసూలు చేసిన చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ అపురూప దృశ్య కావ్యానికి సీక్వెల్ చేసే ఆలోచన, ఆ వార్తలు చాలా కాలం నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల అశ్విని దత్ జగదేక వీరుడు పార్ట్ 2 గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా రోజులుగా పార్ట్ 2 చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఎందుకనో ముందుకు వెళ్లడం లేదు. ఎలాగైనా ఆ చిత్రం చేసి తీరుతాను అని అశ్వినీ దత్ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…