ప్రస్తుత తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో అసిడిటీ కూడా ఒకటి. దీని వల్ల కడుపులో మంటగా ఉంటుంది. ఏమీ సహించదు. అసిడిటీ అనేక కారణాల వస్తుంది. కారణాలు ఏమున్నప్పటికీ ఇది వస్తే ఒక పట్టాన తగ్గదు. అయితే దీన్ని తగ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతుంటారు. అలా కాకుండా కింద తెలిపిన సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే.. అసిడిటీని సులభంగా తగ్గించుకోవచ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అసిడిటీ సమస్య ఉన్న వారు ఒక టీస్పూన్ వాము తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా నమిలి తినాలి. అనంతరం ఒక గ్లాస్ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల అసిడిటీ సమస్య తగ్గుతుంది. లేదా రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ వామును నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగి ఆ వామును తినాలి. దీంతో కూడా ఆ సమస్య తగ్గుతుంది. భోజనం చేసిన వెంటనే సోంపు గింజలను తిన్నా లేదా వాటితో తయారు చేసిన టీని తాగినా అసిడిటీ సమస్య ఉండదు. పాలు, పెరుగు సహజసిద్ధమైన అంటాసిడ్‌ల మాదిరిగా పనిచేస్తాయి. అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే అసిడిటీ సమస్య బాధించదు.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనెను కలిపి భోజనం చేసిన వెంటనే తాగాలి. ఇలా చేస్తే అసిడిటీ సమస్య తగ్గుతుంది. ఒక గ్లాస్ మజ్జిగలో చిటికెడు ధనియాల పొడిని కలుపుకుని తాగితే అసిడిటీ సమస్య తగ్గుతుంది. అరటి పండ్లు కూడా సహజసిద్ధమైన అంటాసిడ్‌ల లాగా పనిచేస్తాయి. భోజనం అనంతరం ఒక అరటి పండును తింటే అసిడిటీ సమస్య ఉండదు. దీంతోపాటు జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. గ్యాస్, మలబద్దకం, అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది.
అసిడిటీ సమస్య తగ్గేవరకు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. అలాగే కారం, మసాలాలను తగ్గించాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల అసిడిటీ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…