టెక్నో మొబైల్స్ సంస్థ టెక్నో స్పార్క్ 9టి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే ను ఏర్పాటు చేశారు. దీంట్లో 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెసర్‌ను అమర్చారు. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ను మాత్రమే అందిస్తున్నారు. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్‌లో 4జీబీతోపాటు అదనంగా మరో 3జీబీ ర్యామ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది వర్చువల్ ర్యామ్ రూపంలో లభిస్తుంది. అందువల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడు అదనంగా మరో 2 మెగాపిక్సల్ పోర్ట్రెయిట్ కెమెరా కూడా ఉంది. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా లభిస్తుంది.
ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో అమర్చారు. అలాగే డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి. దీంట్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
కాగా టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్ టార్కాయిస్ క్యాన్, అట్లాంటిక్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.9,299గా ఉంది. ఆగస్టు 5 నుంచి అమెజాన్‌లో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…