అధిక బరువు సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీని బారి నుంచి బయట పడేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జిమ్‌లు చేయడం, యోగా, వాకింగ్, ఇతర వ్యాయామాలు చేయడం.. డైటింగ్.. వంటివి పాటిస్తున్నారు. అయితే వీటితోపాటు కింద తెలిపిన సూచనలను కూడా పాటించాలి. అప్పుడే బరువు త్వరగా తగ్గగలుగుతారు. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
అధిక బరువును తగ్గించుకునేందుకు నిత్యం అన్ని రకాల పోషకాలు అందేలా చూసుకోవాలి. కొన్ని సార్లు పోషకాహార లోపం వల్ల కూడా బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక నిత్యం తక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడం మాత్రమే కాదు, అందులో అన్ని పోషకాలు ఉండేలా జాగ్రత్త వహించాలి. దీంతో అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
నిత్యం మనం తినే ఆహారంలో రెండు రకాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఒకటి స్థూల పోషకాలు. రెండోది సూక్ష్మ పోషకాలు. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు స్థూల పోషకాల జాబితా కిందకు చెందుతాయి. విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు సూక్ష్మ పోషకాల జాబితా కిందకు వస్తాయి. స్థూల పోషకాలను నిత్యం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ముఖ్యంగా మనం తినే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలి. తరువాత పిండి పదార్థాలను తినాలి. కొద్ది మొత్తంలో కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. దీంతో శరీరానికి అన్ని రకాల పదార్థాలు అందుతాయి. ఫలితంగా మెటబాలిజం మెరుగు పడి కొవ్వు కరిగేందుకు, అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
నిత్యం మనం తినే ఆహారంలో ఫైబర్ కూడా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. పైగా ఆహారం కూడా తక్కువగా తీసుకుంటారు. దీంతో శరీరానికి అందే క్యాలరీల సంఖ్య తగ్గుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, ప్యాక్ చేయబడిన పదార్థాలు, చక్కెర, కొవ్వులు, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు, ఇతర జంక్ ఫుడ్‌లను తినడం మానేయాలి. ఇవి బరువును తగ్గించకపోగా అధిక బరువును పెంచేందుకు తోడ్పడుతాయి. కనుక వీటిని పూర్తిగా మానేయడం వల్ల అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మద్యం సేవించడం, పొగ తాగడం వల్ల కూడా అధిక బరువు పెరుగుతారు. కనుక వీటిని మానేస్తే అధిక బరువు తగ్గుతారు. ఇలా పలు సూచనలు పాటిస్తూ సరిగ్గా వ్యాయామం చేస్తే తప్పక బరువు తగ్గుతారు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…