Badri Movie : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బద్రి సినిమా అఖండమైన విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ ప్రేక్షకులకు అత్యంత దగ్గర అయింది కూడా ఈ చిత్రంతోనే కావడం విశేషం. ఏప్రిల్ 20 తేదీ, 2000 సంవత్సరంలో బద్రి సినిమా విజయలక్ష్మి మూవీస్ బ్యానర్ పై త్రివిక్రమ్ రావు నిర్మాణంలో విడుదలైంది. ఈ సినిమాతోనే పవన్ మరియు రేణుదేశాయ్ లకు మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి.. పెళ్లి వరకూ వెళ్ళింది.
పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్, పూరీ జగన్నాథ్ డైలాగులు ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమా వెనుక మనకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. అసలు ఈ సినిమా కోసం హీరోగా ముందు పవన్ కళ్యాణ్ ను అనుకోలేదట. పవన్ కంటే ముందుగా మరో స్టార్ హీరోను ఈ సినిమాకోసం తీసుకోవాలని అనుకున్నారట. సినిమా ఇండస్ట్రీలో ఇలా హీరో కోసం కథ రాసుకుని.. డేట్స్ కుదరక మరో హీరోను తీసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. అలాగే బద్రి సినిమా విషయంలో కూడా అలాగే జరిగింది.
ఈ సినిమా కథను నాగార్జున కోసం రాసుకున్నాడట. అయితే ఆయన డేట్స్ కుదరక పోవడంతో.. పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేశారు పూర జగన్నాథ్. అయితే పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ ను మార్చాలని కోరారట. కానీ దానికి పూరీ జగన్నాథ్ ఒప్పుకోలేదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ బద్రి సినిమా చేశారు. తరువాత అది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…