Sri Devi : దివంగత అతిలోకసుందరి శ్రీదేవి అంటే దేశవ్యాప్తంగా తెలియని సినీ ప్రేమికులు ఉండరు. 1980-90 దశకాల్లో తన అందచందాలతో శ్రీదేవి ఒక ఊపు ఊపేసింది. తెలుగుతోపాటు తమిళం – మళయాళం సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక శ్రీదేవి నేషనల్ వైడ్‌గా పాపులారిటీని అందిపుచ్చుకొని తనకు ఎదురులేదనిపించింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయాక శ్రీదేవి తెలుగు, తమిళ సినిమాల్లో చేసేందుకు చాలా కండిషన్లు కూడా పెట్టేదన్న ప్రచారం అప్పట్లో జరిగింది.
బాలనటిగానే తన కెరీర్ ను ప్రారంభించిన శ్రీదేవి ఆ తరువాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చిరంజీవి లాంటి హీరోలకు పోటీగా శ్రీదేవి రెమ్యునరేషన్స్ అందుకుంది. ఆమె అందచందాలను వీక్షించేందుకు జనాలు థియేటర్స్‌కి వచ్చిన రోజులు ఉన్నాయి. అయితే ఓ సారి కృష్ణ నటించిన అగ్ని పర్వతం సినిమాలో నటించే అరుదైన అవకాశాన్ని ఈ అమ్మడు మిస్ చేసుకుంది. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. అగ్ని పర్వతం సినిమాని అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రంలో కృష్ణకు జోడీగా రమ్యకృష్ణ, రాధ హీరోయిన్ లు గా నటించారు.
శ్రీదేవి ఈ సినిమాను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే తన పాత్ర ప్రాధాన్యత తగ్గుతుందని అనుకుందట. అందుకే ముందుగా ఓకే చెప్పిన శ్రీదేవి తర్వాత రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. కాగా శ్రీదేవి బాలీవుడ్‌లో పాపులర్ అయ్యాక చిరంజీవితో రెండు సార్లు చేసే ఛాన్స్ వచ్చినా ఆమె పెట్టిన కండిషన్ల వల్లే ఆ రెండు సినిమాలు ఆగిపోయాయన్న ప్రచారం కూడా ఉంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…