Actress : హీరోల కంటే మేం ఏం తక్కువ అంటున్నారు స్టార్ హీరోయిన్లు. వరుసగా 2,3 సక్సెస్ లు కనిపిస్తే చాలు రేట్లు పెంచేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని చూస్తున్నారు. అందుకే రేట్లు పెంచేసి చేతినిండా సంపాదించుకుంటున్నారు. ఇప్పటి యంగ్ స్టార్ హీరోయన్లతో పాటు.. సీనియర్ హీరోయిన్లు కూడా కోట్లు డిమాండ్ చేస్తున్నారు. సౌత్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ల రెమ్యూనరేషన్ లు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ తో పాటూ తెలుగు హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం సామ్ రూ.3 నుండి రూ.5 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటోంది. నయనతార సీనియర్ హీరోలతో జోడీ కడుతున్నా రెమ్యూనరేషన్ విషయంలో రాజీపడటం లేదు. ఒక్కో సినిమాకు నయనతార రూ.3 కోట్లు అంతకంటే ఎక్కువే తీసుకుంటున్నట్టు టాక్. లేడీ ఓరియెంటెడ్ సినిమాలవల్ల కెరీర్ కోల్పోయింది అనుకున్న టైమ్ లోనే.. స్టార్ హీరోల సినిమా ఛాన్స్ లు కోట్టేసింది కీర్తి సురేష్. ఇది వరకూ 2 కోట్లు తీసుకున్న కీర్తి ఇప్పుడు 3 నుంచి 4 కోట్లు డిమాండ్ చేస్తుందట.
అల వైకుంఠపురం సినిమాతో బుట్టబొమ్మ పూజహెగ్డే ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఒక్కో సినిమాకు ఈ బ్యూటీ రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ ను అందుకుంటోంది. ప్రస్తుతం అనుష్క శెట్టి పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ నవీన్ పొలిశెట్టి హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది. ఇక అనుష్క ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. పుష్ప సినిమాతో రష్మిక మందన్న నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగా బాలీవుడ్ లో సైతం సినిమాలు చేస్తోంది. ఇక ప్రస్తుతం రష్మిక ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…