Sr NTR : సినిమాలు, రాజకీయాలలో రాణించడం అంత ఈజీ కాదు. కాని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రికార్డులు క్రియేట్ చేసిన వాళ్లలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని చెప్పవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ గౌరవించే వాళ్లలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. సినిమాల్లో ఉన్న సమయంలో ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే అవకాశం ఉన్నా సీనియర్ ఎన్టీఆర్ పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకొని నిర్మాతలకి సపోర్ట్‌గా ఉన్నారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు కాగా అన్ని రకాల వంటకాలను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారట.సినిమా షూటింగ్ సమయంలో కూడా విడిగా కాకుండా అందరితో కలిసి తినడానికి ఆసక్తి చూపించేవారట.
లైట్ బాయ్ నుంచి మేకప్ మేన్ వరకు.. దర్శకుడి నుంచి నిర్మాత వరకు.. ఎవరికి ఇవ్వా ల్సిన గౌరవం వారికి ఇచ్చేవారు ఎన్టీఆర్. అంతేకాదు.. అందరితోనూ కలివిడిగా ఉంటూ కలిసి భోజనం చేసేవారు. అయితే.. అన్నగారు.. పక్కా మాస్. పైగా పల్లెటూరు నుంచి వచ్చిన రైతు బిడ్డ కావడంతో హటల్ ఫుడ్ అంతగా ఇష్టపడేవారు కాదట. “మనిషన్నాక.. కలివిడి ఉండాలోయ్.. కలివిడి. నేనొక్కడినీ కూర్చుని తింటే.. రుచి కూడా తెలీదు.“ అని తరచుగా తనతో అనేవారని.. గుమ్మడి వెంకటేశ్వరరావు.. తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఎస్వీ రంగారావు.. గుమ్మడి, ప్రభాకర్‌రెడ్డి, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, రాఘవేంద్రరావు.. ఇలా అందరితోనూ.. అన్నగారు వంటకాలను పంచుకునేవారు.
అయితే ఎన్టీఆర్‌కి మాగాయ పచ్చడి అంటే చాలా ఇష్టమట. నిమ్మకూరులో ఉండే వారి పిన్ని ఆయన కోసం మాగాయ పచ్చడిని పెట్టి ప్రత్యేకంగా ప్యాక్ చేసి చెన్నైకి పంపించేవారట. ఆ పచ్చడి తన చేతికి వచ్చిందో లేదో దానిని నాన్ వెజ్ కన్నా ఎక్కువగా భావించి తినేవారట. మా ఊరి మాగాయ్ తినాల్సిందే అని సావిత్రి, భానుమతి, ఎల్లార్, ఈశ్వరి వంటి చాలా మందికి ప్రత్యేకంగా రుచి చూపించారు అన్నగారు. స్టార్ హీరో అయినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ తిండి విషయంలో ఎలాంటి నియమనిబంధనలు పాటించలేదు. నచ్చిన వంటకాలని ఇష్టంగా తిన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…