Poorna : మత్తెక్కించే అందాలతో కుర్రకారు మతులు పోగొట్టే అందాల ముద్దుగుమ్మ పూర్ణ. టాలీవుడ్ లోకి ‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మకి సీమటపాకాయ్ చిత్రం పూర్ణకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అనంతరం అవును, అవును 2, రాజుగారి గది లాంటి చిత్రాల్లో పూర్ణ మెరిసింది. క్రమంగా పూర్ణకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో పూర్ణ ప్రత్యామ్నాయం ఎంచుకుంది. బుల్లితెరపై జడ్జిగా అలరిస్తూ సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ పోషిస్తూ వచ్చింది. ఇటీవల అఖండ చిత్రంతో అదరగొట్టింది పూర్ణ.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ తరచుగా తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తనలో గ్లామర్ పదును ఇంకా తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. ఇటీవల తాజాగా పూర్ణ అలియాస్ సామ్నా కాసీం దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీ ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. దీపావళి సందర్భంగా తమ పెళ్లి ఫొటోలు కూడా షేర్ చేసింది. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహం ముస్లిం పద్దతిలో జరిగింది.
కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే పెళ్లి చేసుకున్నామని త్వరలోనే ఫ్రెండ్స్ కు కేరళలో బిగ్ పార్టీ ఇస్తామని చెప్పింది .ఇక పూర్ణకి తన పెళ్లిలో ఆమె భర్త దాదాపు 1700 గ్రాముల బంగారం గిఫ్టుగా ఇచ్చారట . ఒక లగ్జరీ హౌస్ ని తన పేరు మీద మ్యారేజ్ గిఫ్ట్ గా కూడా ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి పూర్ణ లేట్ అయిన కూడా మంచి కోటీశ్వరుడినే పట్టిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూర్ణ పెళ్లికి సంబంధించిన పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కాగా, పూర్ణ పెళ్లిలో ఆమె పట్టుచీర కట్టుకుని రాణిలా దర్శనమిచ్చింది. అలాగే, షానిద్ కూడా షెర్వాణీలో మెరిసిపోతున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…