Jr NTR : ఈ పది సినిమాలు ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు.. అవే చేసి ఉంటే..!

Jr NTR : విశ్వవిఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట‌వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియాస్టార్‌గా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం అనే పాత్ర‌లో న‌టించి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. ఎన్టీఆర్.. గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ‘బాల రామాయణం’ చిత్రంతో తెరంగేట్రం చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని చూసి.. భవిష్యత్తులో ఇతను కచ్చితంగా పెద్ద స్టార్ అవుతాడు అని అనుకున్నారట ఆ చిత్రం దర్శక నిర్మాతలు. వారు అనుకున్న‌ట్టే ఈరోజున మాత్రం ఎన్టీఆర్ నిజంగానే పెద్ద స్టార్ అయ్యి కూర్చున్నాడు.

ఎన్టీఆర్ ఇంత తొంద‌ర‌గా అంత పేరు తెచ్చుకోవ‌డానికి కార‌ణం ఆయ‌న చేస్తున్న కృషి. ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటూ , డైలాగ్ కింగ్, సూపర్ డ్యాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. ‘స్టూడెంట్ నెంబర్ 1’ ‘ఆది’ ‘సింహాద్రి’ వంటి చిత్రాలతో తిరుగులేని మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాదు అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి వారిని కూడా భయపెట్టేసాడు. ‘రాఖీ’ ‘యమదొంగ’ ‘అదుర్స్’ ‘టెంపర్’ వంటి చిత్రాల్లో అతని నటనకు ఎవరైనా హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే. అయితే ఎన్టీఆర్ త‌న కెరీర్‌లో ప‌లు కార‌ణాల వ‌ల‌న కొన్ని మంచి సినిమాలు వ‌దులుకోవ‌ల్సి వ‌చ్చింది.

Jr NTR rejected these 10 movies or else scene is different
Jr NTR

వినాయక్ డైరెక్షన్లో నితిన్ హీరోగా వచ్చిన దిల్ సినిమా కోసం ముందు ఎన్టీఆర్ ను అప్రోచ్ అయ్యాడట వినాయక్. కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడట. ఇక ఆర్య సినిమా కథను ప్రభాస్ రిజెక్ట్ చేస్తే ఎన్టీఆర్ చెప్పాడట సుకుమార్. అయితే అప్పట్లో ఎన్టీఆర్ కొంచెం బొద్దుగా ఉండటం వల్ల తాను ఈ క్యారెక్టర్ సెట్ అవ్వను అని వదిలేసాడట. ఇక అతనొక్కడే చిత్రం కథను సురేందర్ రెడ్డి మొదట ఎన్టీఆర్ కు చెప్పగా అతను రిజెక్ట్ చేసాడట. భద్ర క‌థ‌ని ఎన్టీఆర్ అయితే బెటర్ అని బోయపాటి శ్రీను అని అనుకున్నాడ‌ట‌. కాని రిజెక్ట్ చేశాడు. ఇక కృష్ణ సినిమా కథను కూడా ఎన్టీఆర్ రిజెక్ట్ చెయ్యడంతో వినాయక్ రవితేజ తో తీసి హిట్ కొట్టారు.

కిక్ సినిమా కథని మొదట ప్రభాస్ కు చెప్పాడట సురేందర్ రెడ్డి. అతను నో చెప్పడంతో ఎన్టీఆర్ కు కూడా వినిపించాడట.ఎవడు కథని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు చేద్దాం అనుకున్నారట. కానీ ఎందుకో డ్రాప్ అయ్యారు. శ్రీమంతుడు కథను ఎన్టీఆర్ కు చెప్తే రిజెక్ట్ చేసాడు. ఊపిరి సినిమాలో నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీ పాత్రకు ముందుగా ఎన్టీఆర్ ను అనుకున్నాడు దర్శకుడు వంశీ. కానీ ఎన్టీఆర్ స్క్రిప్ట్ ల్లో మార్పులు కావాలి అన్నాడట. ఇక బ్రహ్మోత్సవం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మొదట ఈ కథని ఎన్టీఆర్ కు చెప్పాడు. కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో మహేష్ ఈ సినిమా చేశాడు. నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాని.. వక్కంతం వంశీ డైరెక్టర్ గా మారి అల్లు అర్జున్ తో చేసిన ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. శ్రీనివాస కళ్యాణం చిత్రాన్ని దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ముందుగా ఎన్టీఆర్ తో ప్లాన్ చేశారు. కానీ ఎన్టీఆర్ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago