Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన దిల్ రాజు కొద్ది రోజుల క్రితం తన రెండో పెళ్లితో తెగ హాట్ టాపిక్ అయ్యాడు. మొదటి భార్ అనిత అనుకోని పరిస్థితుల్లో మరణించడంతో కొన్నాళ్ల పాటు ఒంటరి జీవితం గడిపిన దిల్ రాజు కుమార్తె సహా శ్రేయోభిలాషుల సలహా మేరకు తేజస్విని అనే ఒక అమ్మాయిని కరోనా సమయంలో కొద్ది మంది సన్నిహితల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న వెంటనే ఆమెకు వైఘా రెడ్డి అనే పేరు కూడా పెట్టారు.
ఇటీవల దిల్ రాజు రెండో భార్య ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బుడతడి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక తా తన మొదటి భార్య పేరులోని మొదటి రెండు అక్షరాలు రెండో భార్య పేరులోని మొదటి రెండు అక్షరాలు కలిపి బుడతడికి అన్దై రెడ్డి అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే రీసెంట్‌గా దిల్ రాజు తన సతీమణి తేజస్విని, కుమారుడు అన్వై రెడ్డితో కలసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కొడుకు తలనీలాలు సమర్పించేందుకు దిల్ రాజు ఫ్యామిలీతో కలసి తిరుమలకు వెళ్లగా, వారికి ఫ్యామిలీకి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు.
అయితే ఆలయం బయట దిల్ రాజు కొడుకు అన్వై రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అన్వై రెడ్డి క్యూట్ లుక్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. ఆ చిన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కుమారుడిని ఎత్తుకుని దిల్ రాజు మాడవీధుల్లో నడిచిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. భార్య, కుమారుడితో కలిసి కెమెరాలకు పోజువ్వడంతో ఆ పిక్స్ నెట్టింట హాల్ చల్ చేస్తున్నాయి. కాగా, ఇటీవల దిల్ రాజు బ్యానర్ లో బలగం చిత్రం తెరకెక్కింది. కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సొంతం చేసుకుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…