Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించి మంచి విజయాలు అందుకున్నారు. చివరిగా బలగంతో హిట్ అందుకున్న దిల్ రాజు శాకుంతలంతో నిరాశపరిచాడు. నా 25 ఏళ్ల కెరీర్లో శాకుంతలం ఊహించని పరిణామం అంటూ ఫెయిల్యూర్ పై నేరుగా మాట్లాడారు. అయితే దిల్ రాజు స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, ప్రభాస్ లతో సినిమా చేసి చాలా కాలం అవుతుంది. ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్, ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా చేసిన దిల్ రాజు ఈ మధ్య కాలంలో మళ్లీ సినిమా చేయలేదు. దీంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్, ప్రభాస్ లతో ఎప్పుడు సినిమాలు చేస్తున్నారని అడగ్గా… ప్రభాస్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి నిర్మిస్తున్నాను. దాదాపు ఇది ఫైనల్ అయ్యింది. అలాగే ఎన్టీఆర్ తో ఒక మూవీకి ఒప్పందం చేసుకున్నాను. ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంద అని చెప్పుకొచ్చారు.. అలాగే పవన్ కళ్యాణ్ తో మరొక చిత్రం చేయబోతున్నాను… అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ వార్త విని స్టార్ హీరోల అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరోవైపు ఈ మూవీకి సంబంధించి లెక్కల విషయంలో చర్చ నడుస్తుంది.
మూడు ప్రాజెక్ట్స్ ఫైనల్ అయితే దిల్ రాజు దాదాపు రూ. వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు లెక్క. ఎన్టీఆర్, ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. యావరేజ్ బడ్జెట్ రూ. 300 కోట్లకి పైగా ఉంటుంది. పవన్ మూవీ కూడా ఓ రెండు వందల కోట్లకు తక్కువ ఉండదు. మరి వీటితో దిల్ రాజు ఇంకెంత వెనకేసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దర్శకుడు శంకర్ చాలా ఉన్నతంగా తెరకెక్కిస్తున్నారు. సాంగ్స్, ఫైట్స్ కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్లో 50వ చిత్రంగా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…