Dasara Movie : ద‌స‌రా మూవీకి సిల్క్ స్మిత‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి.. ఇది తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Dasara Movie : నేచుర‌ల్ స్టార్ నాని రా క‌థ‌తో సినిమాలు చేసిన‌వి చాలా త‌క్కువ‌. తొలి సారి ద‌సరా అనే సినిమా చేశాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓదెల దర్శకత్వ వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రం సింగరేణి నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ నెల 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ నటించిన ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా శరవేగంగా జ‌రుపుతున్నారు. నాని ఈ చిత్రంలో మాస్ లుక్ లో కనిపించబోతున్నారు వీర్లపాలెం అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతున్నట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా లెవల్ లో ద‌స‌రా సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో చిత్ర బృందం పాల్గొంటుంది. . అయితే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్ లో అలనాటి అందాల తార సిల్క్ స్మిత ఫోటో కూడా కనిపిస్తుంది. అంతే కాకుండా ఓ పాటలోనూ సిల్క్ స్మిత ఫోటోలు క‌నిపిస్తుండ‌డంతో, ఆమెకు ఈ సినిమాకు ఉన్న సంబంధం ఏంటా అని ఆరా తీయడం ప్రారంభించారు నెటిజన్స్. దీనిపై రీసెంట్‌గా చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల పై క్లారిటీ ఇచ్చారు.

Dasara Movie and silk smitha what is the relation between them
Dasara Movie

తన చిన్నతనంలో వాళ్ల తాతయ్యకు ఓసారి కాలికి దెబ్బ తగిలినపుడు ఆయన కొంత కాలం ఇంట్లోనే ఉన్నారని, అప్పుడు ఏదైనా కావాలి అంటే తననే బయటకు పంపించేవారని చెప్పారు శ్రీకాంత్. అలా తాను కల్లు దుకాణం వద్దకు వెళ్లి తన తాత కోసం కల్లు తెచ్చేవాడినని ఆయన పేర్కొన్నారు. ఆ స‌మ‌యంలో మొదటి సారి కల్లు దుకాణం వద్ద సిల్క్ స్మిత ఫోటో చూశానని , అప్పటినుంచి తన ఫోటో అలా మైండ్ లో ఉండిపోయిందని చెప్పారు. తర్వాత ఆమె నటించిన సినిమాలు, సినిమాల పట్ల ఆమెకు ఉన్నపాషన్ చూసి , ఆ టైమ్ లో అలా ఉండటానికి చాలా ఘట్స్ ఉండాలని అనిపించిందని చెప్పారు. అప్పటి నుంచి ఆమెపై అభిమానం అలా పెరుగుతూనే ఉందని పేర్కొన్నారు. ఆమెపై ఉన్న అభిమానాన్ని ఇలా ఈ సినిమా ద్వారా చాటుకున్నానని తెలిపారు శ్రీకాంత్. అందుకే ఈ సినిమాలో చాలా చోట్ల సిల్క్ స్మిత ఫోటోలు కనిపిస్తాయని తెలిపారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago