Daggubati Purandeshwari : పురంధేశ్వ‌రి పంచ్‌ల‌కి తెగ న‌వ్వుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఫ్యాన్‌పై నాన్‌స్టాప్ పంచ్‌లు..

Daggubati Purandeshwari : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం రంజుగా మారుతుంది.ఒక‌రిపై ఒక‌రు అవాకులు పేల్చుకుంటున్నారు. ప‌వన్ క‌ళ్యాణ్ అయితే ఈ సారి జ‌గ‌న్‌ని అధికారంలోకి రానివ్వ‌కుండా చేయాల‌ని టీడీపీతో, బీజేపీతో జ‌త‌క‌ట్టారు జ‌న‌సేనాని. పురంధేశ్వరి కూడా జ‌గ‌న్‌పై కామెంట్స్ విసురుతూ త‌న‌దైన పంచ్‌ల‌తో ప్ర‌చారంలో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఓ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న ఉండ‌గా, జ‌గ‌న్‌పై త‌న‌దైన శైలిలో పంచ్‌లు విసిరింది. ఫ్యాన్ స్పీడ్ చూస్తే ఒక‌టి, రెండు, మూడు, నాలుగు ఉంటుంది. అదే 151 పెడితే ఎలా ఉంటుందో మ‌నం చూస్తూన్నాం. అంత స్పీడ్ పెట్టి ఇంటి పైక‌ప్పు ఎగిరిపోయేలా మ‌నం చేసుకున్నాం. అందుకే ఈ సారి అలాంటి ఫ్యాన్ మ‌ళ్లీ రాకుండా చేయాల‌ని పురంధేశ్వ‌రి అన్నారు.

ఏపీలో ట్రిబుల్ ఇంజన్ పాలన అవసరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.సమన్వయ కమీటీలు ఏర్పాటు చేసుకుని మూడు పార్టీల క్యాడర్‌ను ఎన్నికల్లో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. ఏపీలో ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. ఏపీలో కొత్త పరిశ్రమలు రావటం లేదని చెప్పారు. మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు, ఎస్సీలకు సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేశారని విరుచుకుపడ్డారు.. దళిత డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును జగన్ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

Daggubati Purandeshwari non stop counters to ysrcp leaders
Daggubati Purandeshwari

గోదావరి ప్రక్షాళన కోసం కేంద్రం రూ.57 కోట్లు మంజూరు చేసినా వైసీపీ ప్రభుత్వం ఎందుకు పనులు చేపట్టలేదని ప్రశ్నించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిరుపయోగంగా మార్చారని దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పురంధేశ్వ‌రి పంచ్‌లు విసురుతున్న స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెగ న‌వ్వేశారు. కాగా, పవన్ కళ్యాణ్ ప్ర‌స్తుతం ఇన్‌ఫ్లూయెంజాతో బాధపడుతున్నారని.. క్రేన్ గజమాలలు, ఫోటోలు, సెల్ఫీలు వద్దంటూ జనసేన నాయకత్వం కార్యకర్తలకు సూచించింది. రోజూ ఏదో ఒక సమయంలో పవన్ కళ్యాణ్‌కు జ్వరం వస్తోందని అందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago