Virat Kohli : ప్రస్తుతం ఐపీఎల్ చాలా రంజుగా సాగుతుంది. ఇప్పుడే ఏఏ టీమ్స్ ప్లే ఆఫ్స్‌కి చేరుకోబోతున్నాయో అర్ధమవుతుంది. డూ ఆర్ డై మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడంతో ఆ జట్టు ఈ సీజన్ నుండి తప్పుకున్నట్టు అయింది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన వేళ ఓటమిపాలైంది డుప్లెసిస్ సేన. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ టీమ్ అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే హైటెన్షన్ మ్యాచ్‌లో బంతి బంతికి విజయం ఇరు టీమ్స్‌తో దోబూచులాడింది. ఆఖరి వరకు పోరాడినా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. అయితే ఆ జట్టు ఓటమికి అనేక కారణాలు చూపిస్తున్నారు నెటిజన్స్.
విరాట్ కోహ్లీ ఔట్‌తో సహా ఇంకొన్ని విషయాల్లో అంపైరింగ్ మిస్టేక్స్ బెంగళూరుకు శాపంగా మారాయి. అవన్నీ అనుకూలంగా వచ్చి ఉంటే ఆ టీమ్ మరికొన్ని బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించేది. విరాట్ ఔట్ నుంచి మొదలైన అంపైరింగ్ తప్పులు సుయాష్ సిక్స్ విషయం వరకు బెంగళూరుకు వ్యతిరేకంగా వచ్చాయి. విరాట్ ఔట్ సమయంలో నడుము కంటే ఎత్తులో వచ్చిన బాల్‌ను డిఫెన్స్ చేయబోయి ఔట్ అయ్యాడతను. సాధారణంగా అది నో బాల్. కానీ టెక్నికల్‌గా చూసుకుంటే బాల్ డిప్ అయింది కాబట్టి విరాట్‌ను ఔట్‌గా ప్రకటించారు. లోమ్రోర్ను సునీల్ నరైన్ ఔట్ చేశాడు. అయితే అది నో బాల్. నరైన్ బంతి వేసిన సమయంలో అతడి ఫ్రంట్ ఫుట్ లైన్‌ను దాటింది. అయినా దీన్ని గమనించని అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు.
ఏప్రిల్ 21, 2024న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1 బ్రీచ్ చేస్తే మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్,’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం కోహ్లీ లెవెల్ 1 అఫెన్స్కి పాల్పడ్డాడు. తనపై ఐపీఎల్ వేసిన జరిమానాను అంగీకరించాడు విరాట్ కోహ్లీ.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…