Constipation : నేటి ఆధునిక యుగంలో చాలామందిని వెంటాడే సమస్య మలబద్ధకం. దీర్ఘకాలిక మలబద్ధకం కొన్ని వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉండే మలాన్ని విసర్జించడంలో ఏర్పడే సమస్యనే మలబద్ధకం అంటారు. దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉన్నవారు మలవిసర్జనకు ఎక్కువగా శ్రమ పడవలసివస్తుంది. మలబద్ధకం అనేక కారణాలను కలిగి ఉంటుంది. ఈ మాలబద్ధక సమస్యనే ఆయుర్వేదంలో ఆనాహము అని పిలుస్తారు. ఏ వ్యక్తి అయితే మలబద్దకం సమస్యను ఎదుర్కొంటారో వారికీ నడుము, వీపు నందు నొప్పి కలిగి ఉండటం, కడుపునొప్పి, ఆయాసము, ముఖములో మొటిమలు, దద్దుర్లు, వాంతి వంటి లక్షణాలు వస్తాయి. దప్పిక, జలుబు, శిరస్సు నందు మంట, రొమ్ము పట్టినట్లు ఉండటం, తేన్పులు పైకి రాకుండా ఉండటం వంటి లక్షణాలు మరికొందరిలో కనపడతాయి. మలబద్దకం సమస్య అనేది పెరుగుతున్న కొలది మనిషి వాతరోగాలను ఎదుర్కొంటాడు .
మరి ఇలాంటి సమస్య నుంచి బయటపడాలి అంటే ఆయుర్వేద నిపుణులు మీ ఆహారంలో ఈ నాలుగు పదార్థాలను చేర్చుకుంటే చాలు మనబద్ధక సమస్యకు గుడ్ బై చెప్పవచ్చని వెల్లడిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మలబద్ధక సమస్యను తగ్గించే ఆ నాలుగు అద్భుతమైన ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధక సమస్యను నివారించే అతి ముఖ్యమైన మసాలా దినుసు అల్లం. మెరుగైన జీర్ణక్రియ ప్రేరేపించి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఉదయం ఆహారంగా అల్లం టీలో జోడించి తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య అనేది నియంత్రణలోకి వస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ ప్రేగులలోని మలాన్ని సాఫీగా బయటికి రావడానికి సహాయపడుతుంది.
అదేవిధంగా ఆపిల్ పండులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం జీర్ణం కావడాన్ని సులభతరం చేస్తుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అదనంగా, యాపిల్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబ్బట్టి ఇది మలాన్ని మృదువుగా చేస్తుంది. అంజీరా మరియు నల్ల ఎండు ద్రాక్షని రాత్రిపూట నానబెట్టి, ఉదయం ఈ సూపర్‌ఫుడ్‌ను తీసుకోవడం మంచిది. ఈ రెండింటిలో మంచి మొత్తంలో ఫైబర్ మరియు పిండి పదార్థాలు ఉన్నాయి. ఇవి ప్రేగులను ఆరోగ్యకరంగా తయారు చేయడంతో పాటు మలబద్ధక సమస్యలు నియంత్రిస్తుంది.
మీ ఆరోగ్యవంతమైన జీర్ణాశయానికి జొన్నలు ఆహారంలో జోడించడం చాలా మంచిది. ఇది గ్లూటెన్ రహితం. అధిక ప్రోటీన్, సూక్ష్మపోషకాలు, ఐరన్ మరియు మరెన్నో పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో బాగా సహకరిస్తాయి. మీకు అజీర్ణం మరియు మలబద్ధకం ఉన్నట్లయితే ఆవు నెయ్యితో జొన్న రొట్టెను తయారు చేసుకోవడం తినడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది.
ఇక చివరిగా చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మీ ప్రేగులు పనితీరు అద్భుతంగా ఉంటుంది. గోరు వెచ్చని నీరు త్రాగడం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మీ శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. మల బద్ధక సమస్యతో బాధపడేవారు ఉదయం గోరువెచ్చని నీటిని త్రాగవచ్చు మరియు రాత్రి మలబద్ధకం నుండి ఉపశమనం పొందేందుకు ఉత్తమంగా పనిచేస్తుంది. ప్రేగు కదలికలను సులభతరం చేయడానికి మీ ఆహారంలో ఈ ఆహార పదార్థాలను చేర్చుకోండి అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…