Ori Devuda Movie : ఓరి దేవుడా మూవీ ఓటీటీలో.. ఎందులో, ఎప్పుడు.. అంటే..?

Ori Devuda Movie : ఇటీవ‌లి కాలంలో ఓటీట డిమాండ్ ఎంత‌గా పెరిగిందో మ‌నం చూస్తూనే ఉన్నాం. చిన్న సినిమాల‌తో పాటు పెద్ద సినిమాలు కూడా థియేట‌ర్స్‌లో రిలీజైన కొద్ది రోజుల‌కే విడుద‌ల అవుతున్నాయి.మాస్ కా దాస్ యంగ్ హీరో హీరో విశ్వక్ సేన్ హీరోగా మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “ఓరి దేవుడా”. తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన ఈ చిత్రం తన ఒరిజినల్ చిత్రం “ఓహ్ మై కడవులే” కి రీమేక్ గా తెలుగులో తెరకెక్కింది. మరి తెలుగులో అయితే ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ కూడా అయ్యింది.

ఇప్పుడు ఈ చిత్రం అయితే లేటెస్ట్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. గురువారం అర్ధరాత్రి నుంచే ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ‘‘లైఫ్‌లో భార్య స్నేహితురాలిగా ఉండొచ్చు. కానీ… స్నేహితురాలే వైఫ్‌గా రాకూడదా?’ అనే కాన్సెప్ట్‌ మీద సినిమా నడుస్తుంది. మధ్యలో హీరో తన కష్టాల్ని దేవుడు (వెంకటేశ్)తో మొరపెట్టుకోవడం.. ఆయన కొన్ని కండీషన్స్‌తో హీరోకి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం ఇలా సినిమా చాలా ఫన్నీగా సాగుతుంది. కేవలం 22 రోజుల వ్యవధిలో ఈ సినిమా ఓటీటీలోకి రావడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తోంది.

Ori Devuda Movie streaming on ott know the app
Ori Devuda Movie

ఈ చిత్రంలో అయితే మన టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించగా పీవీపీ సినిమాస్ వారు నిర్మాణం వహించారు అయితే . ఓటీటీల్లో త్వరత్వరగా కొత్త సినిమాలు రిలీజవుతుండడం వల్ల థియేట్రికల్ కలెక్షన్లు తగ్గిపోతున్నాయని.. తాత్కాలిక ప్రయోజనం గురించి ఆలోచిస్తే.. భవిష్యత్తులో భారీ నష్టాలు తప్పవని భావించి థియేటర్లలో రిలీజైన 50 రోజులకు కానీ కొత్త చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేయకూడదని తీర్మానించారు. ఈ తీర్మానం జరిగిన టైంలో రిలీజైన బింబిసార, సీతారామం, కార్తికేయ-2 చిత్రాల విషయంలో కొంచెం కఠినంగానే ఈ నిబంధన అమలు చేశారు. అయితే 20 రోజుల్లోపే ఆహాలోకి వచ్చేస్తోంది ఓరిద దేవుడా. ఈ చిత్రంలో దిల్ రాజు, పీవీపీ లాంటి పెద్ద నిర్మాతలు భాగస్వాములు. ఇలాంటి పెద్ద నిర్మాతలే తాము పెట్టుకున్న రూల్‌ను బ్రేక్ చేసి ఒక పేరున్న సినిమాను ఇంత త్వరగా ఓటీటీలోకి వదిలేస్తే మిగతా ప్రొడ్యూసర్లు ఈ రూల్‌ను ఏం పాటిస్తార‌నే చ‌ర్చ న‌డుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago