CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని క్ష‌మించ‌మ‌ని దేవుడిని కోరాన‌న్న హ‌రీష్ రావు.. అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన కాంగ్రెస్..

CM Revanth Reddy : తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక కేసీఆర్ ఫామ్ హౌజ్‌కే ఎక్కువ‌గా ప‌రిమితం అయ్యారు. ఆయ‌న అసెంబ్లీకి రావ‌డం లేదు, ప్ర‌త్యేక సభ‌ల‌లో క‌నిపించ‌డం లేదు. ఎక్కువ‌గా కేటీఆర్, హ‌రీష్ రావు కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రైతు ధర్నాలు చేస్తున్నారు. రైతు రుణమాఫీని సంపూర్ణంగా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వం రైతులపై అక్రమ కేసులు పెట్టి అణిచివేసే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ అన్నారు.

రైతుల రుణమాఫీ విషయంతో సీఎం రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయట పడింది. మోసం రేవంత్ రెడ్డిది, పాపం కాంగ్రెస్ పార్టీది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రేవంత్‌ రెడ్డి జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నడు. ఏ ఊర్లో నైనా వంద శాతం రుణమాఫీ అయిందా? అని ప్రశ్నించారు. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. రుణమాఫీ మొత్తం కాలేదని, తెలంగాణ ప్రజలను కాపాడాలని యాదగిరిగుట్ట నర్సింహ స్వామిని వేడుకున్నాని చెప్పారు. ఆగస్టు నెల వచ్చినా ఊర్లల్లో చెరువులు నింపడం లేదు. రైతుబీమా, రైతుబంధు ఇచ్చి చెరువులు నింపిన ఘనత కేసీఆర్‌ది అన్నారు.

congress counter to harish rao for comments on CM Revanth Reddy
CM Revanth Reddy

రేవంత్‌ రెడ్డి చేసిన పాపాన్ని క్షమించాలంటూ పంతులుగారి ద్వారా స్వామివారికి విన్నవించుకున్నానంటూ హ‌రీష్ రావు కామెంట్ చేయ‌గా, దీనిపై కాంగ్రెస్ గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ, “మీ మేనమామ చేసిన పాపాలను క్షమించమని కోరుతూ గుళ్ళు గోపురాలు తిరగలేదు ఎందుకు? నాడు కేసీఆర్ పాపాల పల్లకి మోసిన నువ్వు, నేడు కేటీఆర్ పల్లకి ఎక్కడ మోయాల్సి వస్తదోనని తల్లడిల్లుతున్నావు. కేసీఆర్ పాపాలు పండి ఆ పార్టీ అధ్యక్ష పదవి, ప్రతిపక్ష నేత పదవి పోతే.. నువ్వు ఆ కుర్చీని ఎక్కి, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయొచ్చని ఎదురుచూస్తున్నావు. అందుకే మీ మేనమామ చేసిన పాపాలకు పరిహారం చేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది,” అని ట్వీట్‌ చేస్తూ హరీష్ రావు ఫోటో పెట్టి ‘యాదాద్రి దేవాలయం సాక్షిగా మీరు అవినీతి చేయలేదని ప్రజలకు చెప్పగలరా?’ అంటూ అద్దిరిపోయే కౌంట‌ర్ వేసింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago