Janasena : జ‌న‌సేన మంత్రుల్ని ప‌క్క‌న పెట్టేశారా..? అస‌లు లోలోప‌ల ఏం జ‌రుగుతోంది..?

Janasena : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. జ‌న‌సేన పార్టీ గేమ్ ఛేంజ‌ర్‌గా మార‌డంతో కూట‌మి భారీ విజ‌యంతో గెలుపొందింద‌ని అంద‌రికి తెలిసిందే. అయితే టీడీపీ ఎక్కువ స్థానాల‌లో పోటీ చేయ‌డం వ‌ల‌న ఆ పార్టీ నుండే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కువ మంది ఉన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లకు మంత్రి పదవులు వరించాయి. ఇక పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. నాదెండ్ల మనోహర్‌ను ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నియమించారు. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్‌ను పర్యాటకం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ దక్కింది.

అయితే అధికారంలోకి వ‌చ్చాక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స‌హ ఇత‌ర జ‌న‌సేన మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు తెలుగు దిన‌ప‌త్రిక‌ల‌లో క‌నిపించ‌డ‌మే త‌గ్గింది. ఆగ‌స్ట్ 15న గ్రామ క‌మిటీల స‌మావేశాల‌కి సంబంధించిన వార్త‌ల‌తో ప‌వ‌న్ పేరు ప‌త్రిక‌లో క‌నిపించింది. నాదెండ్ల మ‌నోహ‌ర్, కందుల దుర్గేష్‌ల పేర్లు మ‌చ్చుక‌కి కూడా కనిపించ‌డం లేదు. 21 మంది శాసన సభ్యుల బలం ఉన్న జనసేనకు మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యత లభించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. రాయలసీమ, దక్షిణ ప్రాంత జిల్లాల నుంచి జనసేన ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ.. వారిని పక్కన పెట్టారనే వాదనలు అప్పుడే వెలువడుతున్నాయి. ఈ ప్రాంత జనసేన నాయకుల్లో అసంతృప్తి రాజుకుందంటూ వార్తలు వస్తోన్నాయి.

what is happening inside of Janasena are they getting good receive
Janasena

జనసేనకు మరో పదవిని ఆఫర్ చేయనున్నట్టు వార్త‌లు వినిపిస్తున్నా దానిపై క్లారిటీ రావ‌డం లేదు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆయన నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఈ సమాచారాన్ని జనసేన అగ్రనాయకత్వానికి అందించారని, ఈ పదవి కోసం పేర్లను సూచించాలని కోరినట్లు తెలుస్తోంది. మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసే కార్య‌క్ర‌మాల‌కి సంబంధించి పెద్ద‌గా ఎలివేష‌న్ ఇవ్వ‌ట్లేదు. మెల్లగా వారిని సైడ్‌కి జ‌రిపే ప్ర‌య‌త్నం చేస్తున్నారా అనే చ‌ర్చ కూడా న‌డుస్తుంది. సీఎం స‌మీక్ష‌ల‌కి ఇచ్చే ఎలివేష‌న్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన చేయ‌డం లేదు. దీంతో జ‌న‌సైనికులు కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago