CM YS Jagan : జ‌గ‌న్‌ని చుట్టుముట్టిన యూత్.. డ్యాన్స్ చేయాలని ఫోర్స్ చేయ‌డంతో కాలు క‌దిపాడుగా..!

CM YS Jagan : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ప్ర‌చారంలో ముందుకు వెళుతుంది. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళుతుంది. ఇడుపుల పాయలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర శుక్రవారం గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గం, దూళిపాళ్ల నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. సత్తెనపల్లి , మేడికొండూరు, గుంటూరు మీదుగా యాత్ర సాగుతుంది. ఏటూకూరు బైపాస్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు. సభ అనంతరం సీఎం జగన్ నంబూరులో రాత్రికి బస చేస్తారు. జగన్ బస్సు యాత్ర 13వ రోజు గుంటూరు జిల్లా ధూళిపాళ్ల నుంచి ప్రారంభవుతుంది. రంజాన్‌ సందర్భంగా నిన్న (గురువారం) ఒకరోజు యాత్రకు బ్రేక్ ఇచ్చారు.

12వ రోజు పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి బయలుదేరి బస్సు యాత్ర పిడుగురాళ్ల వరకు అక్కడ నుంచి ధూళిపాళ్ల వరకు కొనసాగింది. అక్కడే జగన్ బస చేశారు. ధూళిపాళ్ల బస నుంచి సీఎం జగన్ బయలుదేర‌గా, సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు దగ్గరకు చేరుకొని అక్క‌డ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏటుకూరు బైపాస్ చేరుకుంటారు. అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. బ‌స్సు యాత్ర‌లో జ‌గ‌న్ అంద‌రిని క‌లుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌తి ఒక్కరిని ప్రేమ‌గా ప‌ల‌క‌రిస్తూ వారి స‌మ‌స్య‌ల‌ని తెలుసుకుంటున్నారు.

CM YS Jagan spent time with you by enjoying dancing
CM YS Jagan

ఇక జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌లో భాగంగా ఆయ‌న‌ని అభిమానించేవారు ఒక్క‌సారిగా ఆయ‌న వ‌ద్దకు వ‌చ్చారు. కొంద‌రితో జ‌గ‌న్ సెల్ఫీలు దిగారు. కొంద‌రిని ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఇంకొంద‌రు జ‌గ‌న్‌ని డ్యాన్స్ చేయాలంటూ ఫోర్స్ చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కాలు క‌దిపిన‌ట్టు ఓ వీడియో అయితే నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక ఇటీవ‌ల జగన్‌ని కలిసేందుకు చెప్పులు లేకుండా కాన్వాయ్ వెంట పరుగులు తీసింది వెంకాయమ్మ అనే మహిళ. ఆమెను చూసి కాన్వాయ్ ఆపారు సీఎం. ఆమెను పిలిచి మాట్లాడారు. రామిరెడ్డిపాలేనికి చెందిన వెంకాయమ్మ.. ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎండను కూడా లెక్కచేయకుండా కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టింది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైర‌ల్ అయింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago